ఈ ప్రపంచంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఎంతో విలువైనది సమయం. ఎవరైతే ఈ సమయం విలువ తెలుసుకుంటారో వారు జీవితంలో వృద్ధిలోకి రావడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సమయం విలువ తెలుసుకోకపోతే మాత్రం జీవితాంతం సోమరిపోతుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. యువత కెరీర్ లో విలువైన సమయాన్ని వృథా చేస్తే వారి జీవితాలు వ్యర్థం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మనం జీవితంలో ఏది కోల్పోయినా దానిని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ సమయాన్ని కోల్పోతే ఆ తరువాత దానిని తిరిగి పొందడం అసాధ్యం. కాలం విలువ బాగా తెలిసిన వారు... సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారు మాత్రమే జీవితంలో విజయం సాధించగలరు. కాలం అందరికీ సమానమే. ఆ విషయాన్ని గ్రహించి కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాళ్లు గొప్పవాళ్లు అవుతారు.
సాధారణంగా మనుషుల మనస్సు ఎల్లప్పుడూ సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. బుద్ధి ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటుంది. కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని సులభంగా జయించవచ్చు. ముందు నుంచే సమయం విలువ తీసుకుంటే సక్సెస్ అందుకోవడం అసాధ్యం కాదు. జీవితంలో పనులను ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఏరోజు పనిని ఆరోజే పూర్తి చేస్తే సులభంగా సక్సెస్ సొంతమవుతుంది.