జీవితంలో మనం ఉన్నత స్థానాలకు ఎదగలన్నా, గొప్ప గొప్ప విజయాలు సాధించాలన్నా మన ఆలోచనా తీరును మార్చుకోవాలి. మన ఆలోచనా తీరు పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తామో ఆ ఆలోచనలకు సంబంధించిన మాటలు, చేతలే ఎక్కువగా చేస్తూ ఉంటాము. అయితే పాజిటివ్ ఆలోచనలు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో నెగిటివ్ ఆలోచనలు చేస్తే అదే స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉంటుంది.
నెగిటివ్ ఆలోచనలు ఎల్లప్పుడూ మనల్ని విజయానికి దూరం చేస్తాయి. నెగిటివ్ ఆలోచనలు అనవసరమైన భయాలను పెంచుతాయి. ఇలాంటి ఆలోచనల వల్ల అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల మనం రోజురోజుకు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనలను వీడి మనపై మనం నమ్మకంతో పని చేస్తే సులభంగా సక్సెస్ సాధించవచ్చు.
నెగిటివ్ ఆలోచనలు అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ థింకింగ్ ను ఒకేసారి పూర్తి స్థాయిలో వదిలించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించాలి. నెగిటివ్ ఆలోచనలను కూడా పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నెగిటివ్ ఆలోచనలు వచ్చిన సమయంలో ఇష్టమైన పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తే మనలోని నెగిటివ్ ఆలోచనలు దూరవుతాయి.
ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఆ ఆలోచనలే మనల్ని విజయ తీరాలను చేరుస్తాయి. మనం మన ఆలోచనలను మార్చుకుంటే ఆ ఆలోచనలే పెట్టుబడిగా మారి గొప్ప గొప్ప విజయాలకు దారి చూపిస్తాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల ఇతరులకు కూడా మనపై చెడు అభిప్రాయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.