ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే విజయం సాధిస్తారో వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కెరీర్ లో ఓటమిపాలై ఇంటికే పరిమితమైన వారిని ఎవరూ పట్టించుకోరు. మనం సాధించే విజయాలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మారుతున్న పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించడం అంత సులభం కాదు. విజయం దక్కే చివరి నిమిషం వరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.
ఆ సమస్యలకు, ఆటంకాలకు భయపడి మధ్యలోనే ఆగిపోతే సక్సెస్ సాధించడం కష్టమవుతుంది. జీవితంలో లక్ష్యం కోసం ప్రయత్నించే క్రమంలో గెలవాలన్న తపన ఎంతో ముఖ్యం. ఆ తపనే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. లక్ష్యాన్ని సాధించాలనే క్రమంలో ఇబ్బందులు ఎదురైనా గెలవాలన్న తపన ముందడుగులు వేసేలా చేస్తుంది. కెరీర్ లో సులభంగా సక్సెస్ అందుకోవడానికి కారణమవుతుంది. అలా కాకుండా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువ.
ఎవరైతే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక వేసుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారో వారికే విజయం సులభంగా సొంతమవుతుంది. కొన్నిసార్లు ఏదైనా కారణాల వల్ల ప్రణాళిక ప్రకారం పనులు జరగకపోతే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లక్ష్యాన్ని సాధించటానికి చివరి నిమిషం వరకు కష్టపడాలి.
కొన్నిసార్లు లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా గెలుపు కోసం కష్టపడాలి. గెలవాలన్న తపనతో మరింత కష్టపడి సాధన చేయాలి. లక్ష్యాన్ని సాధించడం కోసం ఇతరుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. జీవితంలో మనం సాధించే చిన్న చిన్న విజయాలే పెద్ద పెద్ద విజయాలకు మార్గం చూపిస్తాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యం కోసం శ్రమించిన వారికి సులభంగా విజయాన్ని సొంతం చేస్తాయి.