రోహిత్ శర్మ... ఏప్రిల్ 30, 1987 నాడు మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జన్మించాడు. అయితే వారి తల్లిదండ్రులకు కాస్త ఆర్థిక పరిస్థితులు ఉండడంతో రోహిత్ శర్మ వారి తాత, బాబాయ్ ల వద్ద పెరిగారు. ఇకపోతే రోహిత్ శర్మ అమ్మ పూర్ణిమా శర్మది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. రోహిత్ శర్మకి తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు విశాల్ శర్మ. ఇకపోతే అతని మేనమామ డబ్బుతో 1999లో ఒక క్రికెట్ క్యాంప్ లో రోహిత్ శర్మ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అలా మొదలు పెట్టిన తన ప్రస్థానం చాలా ఒడిదుడుకులు లోనై ఒకానొక సమయంలో చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడి ఉపకార వేతనం తెచ్చుకొని తన జీవితాన్ని కష్టంగానే మొదలుపెట్టాడు.

 


నిజానికి రోహిత్ శర్మ తన క్రికెట్ పరంగా చూస్తే మొదటగా తను పార్ట్ టైం స్పిన్నర్ గా టీమిండియాలో రంగ ప్రవేశం చేశాడు. అయితే ఇక రాను రాను తన బ్యాటింగ్ రోజురోజుకీ మెరుగు పరుచుకుంటూ టీమిండియాలో ఓపెనర్ గా అవతారమెత్తాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ మొదటలో టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు అనేకసార్లు టీమిండియా లో స్థానం సంపాదించుకోవడం, కోల్పోవడం ఇలా జరుగుతూ ఉండేది. రోహిత్ శర్మ తన మొదటి మ్యాచ్ ను 2007 సంవత్సరంలో ఐర్లాండ్ కు సెలక్ట్ అయ్యాడు. కాకపోతే తొలి మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ చేయనప్పటికీ తన రెండో వన్డేలో మొదటిసారిగా బ్యాటింగ్ చేశాడు. ఇక పోతే ఒకానొక సమయంలో 2011 సంవత్సరంలో తాను ప్రపంచ కప్ కు కూడా సెలెక్ట్ అవ్వలేదు.

 


ఆ తర్వాత అనేక సిరీస్ లలో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపిస్తూ అంచెలంచెలుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇదే ప్రస్థానంలో 2013 సంవత్సరంలో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో బెంగళూరులో ఏకంగా 209 పరుగుల చేసి అవుటయ్యాడు. దీనితో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో వ్యక్తిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక ఆ తర్వాత మరుసటి సంవత్సరమే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ తర్వాత కూడా రోహిత్ శర్మమరో మరో డబుల్ సెంచరీ చేశాడు. ప్రస్తుత క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీ లు కలిగిన ఏకైక వ్యక్తిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు.

 

 

కేవలం టీమిండియా మాత్రమే కాకుండా భారత లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఆడతాడు. మొదటి మూడు సంవత్సరాలు డెక్కన్ చార్జెస్ కు ఆడిన రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉంటూ నాలుగుసార్లు ముంబై ఐపీఎల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఏకంగా 5 సెంచరీలు చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇలా రోహిత్ శర్మ రికార్డుల గురించి చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోదు.

మరింత సమాచారం తెలుసుకోండి: