ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చదువులో, ఆటల్లో, పాటల్లో, ప్రయోగాలు చేయడంలో, ఇతర విషయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో ఆ ఆసక్తే మనల్ని సక్సెస్ వైపు నడిపించి ఉన్నతస్థానాలకు చేరుస్తుంది. ఇతరులతో పోలిస్తే మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. మొదట మనమేంటో మనకు అర్థమైతే జీవితంలో అద్భుతమైన విజయాలు సులభంగా సొంతమవుతాయి.
జీవితంలో సక్సెస్ సాధించాలంటే మొదట మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన బలాలను, బలహీనతలను విశ్లేషించుకోవాలి. మన ఎదుగుదల కోసం బలాలను ఉపయోగించుకుంటూ అదే సమయంలో బలహీనతలను అధిగమించడానికి కృషి చేయాలి. ఏ రంగంపై ఆసక్తి ఉందో గుర్తించి సమాజంలో ఆ రంగానికి ఉన్న ప్రాధాన్యత, అవకాశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ రంగంలో కెరీర్ మొదలుపెడితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాల గురించి కూడా అంచనా వేసుకోవాలి.
ఆ తరువాత ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, సక్సెస్ సాధించడానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవాలి. అందుకోసం ఇతరుల సహాయం కూడా అవసరమని భావిస్తే మనల్ని నమ్మే.... మనం నమ్మకం ఉంచే వ్యక్తుల సహాయం మాత్రమే కోరాలి. మన గురించి అవహేళన చేస్తూ మాట్లాడే వారి మాటలను, ఇతరుల విమర్శలను పట్టించుకోవాల్సిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ విధంగా మనం ఎంచుకున్న రంగం వైపు లేదా లక్ష్యం వైపు ముందడుగులు వేయాలి. ఎదురయ్యే సమస్యలను, ఆటంకాలను సమయస్పూర్తితో ఎదుర్కొంటూ సక్సెస్ వైపు పయనించాలి. ఇతరులకు బాధ్యతలను అప్పగించినా వారు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మనమేంటో మనకు పూర్తిగా అర్థమైతే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది.