మారుతున్న కాలంతో పాటే ప్రపంచంలోని ప్రతి రంగంలో పోటీతత్వం పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం సాధించాలన్నా అంత సులభం కాదు. యువతలో చాలామంది గ్రాడ్యుయేషన్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎంతో కష్టపడితే తప్ప ప్రభుత్వ ఉద్యోగం సాధించలేం. నిపుణులు విశ్లేషణతో ప్రిపరేషన్ సాగిస్తే మాత్రమే విజయం సాధించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.
పోటీ పరీక్షల్లో రానురాను ప్రశ్నల్లో కఠినత్వం పెరుగుతోంది. సిలబస్‌కు తగ్గట్టు సరికొత్త వ్యూహాలతో విశ్లేషణ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించిన వారికి మాత్రమే విజయం సొంతమవుతోంది. ప్రిపరేషన్‌లో అభ్యర్థులు తొలుత ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉన్న అంశాలను గుర్తించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనవసరమైన అంశాల భారం తగ్గుతుంది. గతంలో ఆ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాల శైలిని పరిశీలించాలి.
పేపర్ లో సిలబస్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలో సులభంగా అర్థమవుతుంది. సరైన ప్రణాళికను రూపొందించుకొని సిలబస్ ను అనుకున్న విధంగా పూర్తి చేయాలి. సిలబస్ ను పూర్తి చేయడంతో చిన్న చిన్న సమస్యలు ఏర్పడితే వాటిని అధిగమించి ముందడుగులు వేయాలి. కష్టపడితే తప్పక విజయం సొంతమవుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలీ.
ప్రణాళికాబద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా సమాధానాలను రాయవచ్చు. సిలబస్ పూర్తైన తరువాత వీలైనంత సమయం మాక్ టెస్టులకు కేటాయించాలి. మాక్ టెస్టులు మనం ఎలా ప్రిపేర్ అయ్యాం...? ఎలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకుంటున్నాం....? ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఎంచుకోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి....? అనే విషయాలపై స్పష్టత వచ్చేలా చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రభుత్వ పరీక్షల్లో విజయం తప్పక సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో కష్టపడినా వివిధ కారణాల వల్ల విజయం సొంతం కాదు. అలాంటి సమయంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా కష్టపడితే విజయం తప్పక సొంతమవుతుంది.