- రత్నకిశోర్ శంభుమహంతి
ఆరోగ్యం.. ఆర్థికం..సామాజికం
ఈ మూడూ ఆయనకు అత్యంత ప్రాధాన్యాలు
కొద్దిపాటి చదువుతో తన జ్ఞానాన్ని విస్తరింపజేసిన క్రమం
ఒక్కటి ఎప్పుడూ ఆయనను వెన్నాడుతూనే ఉంటుంది.
సామాజికంగా ఏదో సాధించాలన్న తలంపు కొందరికి అండదండలిచ్చింది. మూడు వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదివించాలన్న తలంపునకు ఊతం ఇచ్చింది
ఆరోగ్యంతో మొదలుకుని మిగిలిన రంగాలకు సంబంధించి సాగిస్తున్న పరిశోధనలూ వాటి ఫలితాలూ
ఇంకాస్త అందుబాటులోకి వస్తే సామాన్యుడికి ఓ ఊరట అందినట్లే! ఇలా అన్ని రంగాల్లోనూ కోటి రెడ్డి సరిపల్లి యువతకు ఆదర్శం.
చావు పలకరించిన ప్రతిసారీ బతుక్కి భరోసా అన్నది వెతుకుతూ పోవాలి నష్టాలు వచ్చిన ప్రతిసారీ వ్యాపారంలో ఏదో ఓ మధ్యే మార్గం వెతకాలి ఒక సంస్థ తనను కాదంది..కనీసం ఆఫీసు గేటు లోపలికీ రానివ్వలేదు ఒక సంస్థ తన ప్రతిభను గుర్తించింది కానీ చుట్టూ ఉన్న వారి అవమానాలు ఉన్న చోట ఉండనీయలేదు. ఇలా ఎన్నో అవస్థలు దాటి హేళనలు భరించి ఇంత వారయ్యారు కోటిరెడ్డి సరిపెల్లి..ఆయన జీవన ప్రస్థానం ఆదర్శనీయం.
16 కంపెనీల అధిపతి, దేశ విదేశాల్లలో ఖ్యాతి.. కోట్ల రూపాయల్లో టర్నోవర్ ఇదీ ఆయన జీవితం.. మన తెలుగు వాడు. మైక్రో సాఫ్ట్ కంపెనీలోనే దిగ్గజంగా ఎదిగాడు... మన తెలుగు వాడు 162 దేశాలకు సేవలందిస్తున్నాడు. మన తెలుగు వాడు. తన సేవలను విస్తృతం చేస్తూ కోట్ల రూపాయలను టర్నోవర్ చేస్తున్నాడు. మన తెలుగువాడు కొత్త విజయాలు తన ఖాతాలో వేసుకుని ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అయ్యాడు. గెలవడం బాధ్యత అన్న మాట నుంచి గెలిపించడం ఓ నైతికత అన్న మా టవరకూ తననూ తన సంస్థనూ విస్తరించాడు. వ్యవసాయం మొదలుకొని మరికొన్ని రంగాలకు తన సంస్థలనూ సంబంధిత పరిశోధనలనూ విస్తృతం చేసి, విజయ పథాన దూసుకుపోతున్నాడు.
ఇంగ్లీషు రాదన్న హేళన
ఇంగ్లీషు తప్ప తనకు మిగతా
ప్రపంచం తెల్సు అన్న భావన
కాన్ఫిడెన్స్ కెన్ స్పీక్స్ ఓన్లీ
ఈ సారి ఆ కుర్రాడు భాగ్యనగరిలో తిరుగాడాడు
తనకంటూ ఓ మార్గం వెతికాడు
మైక్రో సాఫ్ట్ ఉద్యోగం పొందాక ఓ టెన్త్ చదివిన కుర్రాడిగా
కాలరెగరేశాడు.. జావా తక్కువ వయస్సులోనే పూర్తిచేసి
తానేంటో నిరూపించాడు. ఉన్న ఊళ్లో పొలం పనులతో కాలం గడిపితే ఆ లెక్కే వేరు..
ఒక యజమాని కథ
ఇలా ప్రారంభం అవుతుంది
అతడు ఇంట్లో అతడు దేశంలో
అతడు తన వారితో అతడు ఇతరులతో
కోట్లు సంపాదించాలన్న కలలను పంచుకుని తీరుతాడు
లేదా కోట్లు పోగొట్టుకున్నా మళ్లీ నిలబడగలను అన్న కలలతో జీవిస్తాడు.. సంకల్పంతో నెట్టుకువస్తాడు.. కలలకు రంగులు అద్ది తీరుతాడు.. మొహమాటం లేకుండా ఇతరులతో సంభాషించి, తానేంటో చెప్పకనే చెబుతాడు
బాస్ అంటే ఎలా ఉంటాడు.
పదో తరగతి చదివేడు మండలంలో టాపర్
గుడివాడ దగ్గర ఊరు,.. జనార్దనపురం
తరువాత కూడా చదవాలన్నది ఆశ
నాన్న వద్దంటే వ్యవసాయం దిక్కు అయింది
పచ్చని నేలలు పలకరించి పోతుంటే
ఆలోచనలు నింగిని తాకాలన్నంతగా తహతహలాడేవి
ఆ క్రమంలో చదువే మార్గం అనుకుంటే
డిజిటల్ స్క్రీన్లే రేపటి ప్రపంచానికి దిక్కనుకుంటుంటే
నాన్న మాత్రం పొలానికే పరిమితం చేశాడు
పొలంలో కలలను నాటాడు పొలంతో ఏవో ఊసులు చెప్పాడు
ఫలితం కొద్ది కొద్దిగా తన దారి వెతికాడు పీజీడీసీఏ కోర్సు నేర్చి కొత్త అవకాశాలు వెతికాడు..అంచెలంచెలుగా ఎదిగి కోట్లకు అధిపతి అయ్యాడు.
డియర్ బాస్ హ్యాపీ బర్త్ డే