విజయగాథలు మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. మనలో ఉన్న నిద్రాణశక్తిని తట్టి లేపుతాయి. అయితే ఆ విజయగాధల్లో చాలా వరకూ కృష్టి, పట్టుదల కారణంగా ఉన్నత శిఖరాలు అధిరోహించినవే. కానీ.. కొన్ని సక్సస్ స్టోరీ చదివితే నిజమా.. అసలు ఇలా జరుగుతుందా.. అబ్బే.. మనకేదో గ్యాస్ కొట్టేస్తున్నాడు.. సాధించింది కొంతైతే.. ఇంకాస్త మసాలా వేసి చెబుతున్నాడు గురూ అనుకుంటారు. అవును మరి కొందరు సాధించిన విజయాలు అంత నమ్మశక్యంగా ఉంటాయి. కోటి రెడ్డి విజయగాథ కూడా అలాంటిదే.

 

 

 

ఓ మారుమూల పల్లెటూల్లో చదువుకున్న ఓ కుర్రాడు అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో అత్యున్నత పదవి అందుకున్నాడంటే నమ్మగలమా.. దాందే ముంది పల్లెటూరైతే సాధించలేరా అనొచ్చు. కానీ.. ఆ కుర్రాడు చదివింది అప్పటికి కేవలం పదో తరగతి మాత్రమే. అసలు కేవలం పదో తరగతి చదువుతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వస్తుందా.. కహానీ చెప్పడానికైనా ఓ హద్దంటూ ఉండొద్దా అంటారు.. కానీ.. మైక్రోసాఫ్ట్ సంస్థ చరిత్రలో ఓ టెన్త్ క్లాసు కుర్రాడిని తన టాలెంట్ చూసి ఉద్యోగం ఇవ్వడం కూడా అదే మొదలు మరి.

 

 

 

అంతేనా.. మరి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో ఓ పది, పదిహేనేళ్లు చేసిన తర్వాత మళ్లీ ఎవరైనా ఆ ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చేస్తారా.. ఆయన వచ్చాడు. ఎందుకు.. తన దేశం కోసం, తన వాళ్ల కోసం ఏదో చేయాలని.. అలా వచ్చినవాడు ఒకటా, రెండు ఎన్ని రంగాల్లో అడుగు పెట్టాడు.. ఎన్ని సంస్థలు స్థాపించాడు.. ఎన్ని సంస్థలను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు.. అంటే నమ్మడం సాధ్యమేనా.. నమ్మడం కష్టమే..

 

 

 

కానీ ఆ విజయమే ఎదురొచ్చి నవ్వుతూ పలకరిస్తే.. అసలు సిసలు విజయానికి చిరునామాగా నిలుచుంటే ఆ సత్యం అసత్యం అనగలమా.. లేదు కదా. కోటి రెడ్డి కూడా అంతే.. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే .. కోటి గ్రూప్ ఆఫ్ వెంచెర్స్‌కు అధిపతి అయ్యారు. 162 దేశాల్లో 70 కోట్ల ప్రజ‌ల‌కు సేవలందిస్తున్నారు. ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా ల‌క్షల మందికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. అగ్రిటెక్‌, ఎడ్యుటెక్‌, ఫైనాన్స్‌టెక్‌, హెల్త్ టెక్‌, క్వాలిటీ టెక్‌, క‌న్‌స్ట్రక్షన్ టెక్‌.. ఎన్నో రంగాల్లో అడుగు పెట్టారు. ప్రతి రంగంలోనూ విజయమే. మరి ఇవన్నీ సాధించాలంటే ఎంత తపన, పట్టుదల, పరిశ్రమ ఉండాలి. అందుకే ఆయన విజయ కోటి.. కోటి సార్‌.. కోటి అంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: