మనం మనస్సులో ఏదైనా నెరవేరాలని అనుకుని ఆ కోరికను సాధించడానికి ప్రయత్నం చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. బాల్యం నుంచే చదువులో, ఆటల పోటీల్లో సాధించిన విజయాలు మనకు మరపురాని జ్ఞాపకాలుగా మిగులుతాయి. మంచి మార్కులు సాదించడం, క్లాస్ లో ఫస్ట్ రావడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం లాంటి విజయాలు ఎన్నో మనం జీవితంలో పొంది ఉంటాం. కానీ కెరీర్ లో సక్సెస్ సాధించడమే మన జీవితానికి అసలైన విజయం. 
 
మన సాధించాలనే సంకల్పంతో లక్ష్యాన్ని ఎంచుకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ఇలాంటి విజయం వల్ల  గౌరవం, పేరు ప్రతిష్ఠలు, కష్టానికి తగిన ప్రతిఫలం సాధించామన్న తృప్తి మనకు కలుగుతుంది. ప్రతి మనిషి విజయం సాధించాలనే కోరికతోనే ప్రయత్నం మొదలుపెడతాడు. కానీ కొందరికి మాత్రమే విజయం సాధించే సత్తా ఉంటుంది. 
 
తరచూ ఓటములను చవిచూసేవారు తాము విజయం సాధించలేమోనని నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ సాధించాలనే సంకల్పంతో శ్రమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ప్రతి మనిషికి కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. బలాలను గుర్తిస్తూ, బలహీనతలను అధిగమిస్తూ ముందడుగులు వేస్తే మాత్రమే విజయం సాధించగలుగుతాం. విజయం అంత సులభంగా లభించకపోవచ్చు కానీ సాధించడం అసాధ్యం మాత్రం కాదు. 
 
విజయం సాధించడానికి కావాల్సిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం సాధన దిశగా ముందడుగులు వేస్తూ విజయం సిద్ధించేవరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తే సక్సెస్ సొంతమవుతుంది. గత ఓటములను విజయానికి మెట్లుగా మార్చుకుంటే సక్సెస్ ను తక్కువ సమయంలోనే సొంతం చేసుకోవచ్చు. ఇతరుల యొక్క వైఫల్యాలు మన విజయానికి గుణపాఠాలుగా ఉండాలి. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో వున్న సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని ధృడపరచుకుంటే సక్సెస్ సొంతమవుతుంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: