మనలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వాళ్లకు జీవితంలో డబ్బు, కీర్తి లభిస్తాయి. అలా కాకుండా ఓడిపోయిన వాళ్లు ఎలా ఎదగాలో తెలీక ఇబ్బందులతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనం అనుకున్న పనిలో సక్సెస్ సాధించాలంటే ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించాలి. కొంతమంది మొదట్లో బాగానే ప్రయత్నించినా రానురాను లక్ష్యం విషయంలో అశ్రద్ధ వహిస్తారు. 
 
కొన్ని సందర్భాల్లో లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో ఓటమి నుండి కూడా విజయం సాధించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని గతంలో సక్సెస్ సాధించలేకపోవడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించుకోవాలి. మనసులో బలంగా లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకుని సక్సెస్ సాధించే వరకు వెనుకడుగు వేయకుండా ప్రయత్నాలు చేయాలి. 
 
ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో ఉంటే సక్సెస్ ఎప్పటికీ సొంతం కాదు. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనుక దాగివున్న రహస్యాలను తెలుసుకుంటే మాత్రమే సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. వైఫల్యం వెనుక దాగి వున్న కారణాలను పరిష్కార మార్గం కోసం ఎక్కువగా కృషి చేసి మనలోని శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. 
 
విజయం సాధించడానికి పనిని ప్రారంభించడానికి నిర్దిష్ట సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో పనిని ఈ సమయంలోనే ఇపుడే ప్రారంభించాలి. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు కూడా చేరనీయకూడదు. అభ్యాసనను తీవ్రతరం చేసి ఫలితం గురించి ఆలోచించకుండా శ్రమిస్తే విజయం సొంతం అవుతుంది. ఎన్ని రకాల అపజయాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకుండా విజయం కూడా భయపడి మీ దగ్గరకు చేరేలా పట్టుదలతో కృషిచేయాలి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: