మనలో చాలామంది ఉద్యోగం లేదా వ్యాపారం చేసి కెరీర్ లో సక్సెస్ కావాలని అనుకుంటూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో డబ్బును ఆర్జించాలనుకునేవారు వ్యాపారంపైనే దృష్టి పెడతారు. అయితే వ్యాపారంలో సక్సెస్ అయితే లాభాలు ఎలా వస్తాయో ఫెయిల్యూర్ ను చవి చూస్తే నష్టాలు కూడా అదే విధంగా వస్తాయి. సాధారణంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్లను అనేక సందేహాలు వేధిస్తూ ఉంటాయి.
వ్యాపారంలో సక్సెస్ సాధించాలంటే ఎన్నో అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారం పట్ల మన ధోరణి, బిజినెస్ మోడల్, బృందంలో పని చేసే సభ్యులు, మార్కెట్ స్ట్రాటజీ ఇలా చాలా విషయాలపై దృష్టి సారిస్తే మాత్రమే బిజినెస్ లో సక్సెస్ సాధించగలుగుతాం. బిజినెస్ లో విజయం సాధించాలంటే మొదట మన శక్తిపై ఒక అంచనాకు రావాలి. సమస్యలు వస్తే ఏ విధంగా ఎదుర్కొంటామనేది బిజినెస్ లో చాలా ముఖ్యం.
ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలమనే నమ్మకం మనపై మనకు ఉండాలి. అప్పుడే వ్యాపారంలో అనుకున్న ఫలితాలు అందుకోగలుగుతాం. అంతిమ లక్ష్యం సాధిస్తామనే నమ్మకం ఉంటే మాత్రమే వ్యాపారంలో విజయం సొంతమవుతుంది. విజయం సాధించడానికి అకుంఠిత దీక్ష, దృఢమైన సంకల్పం లాంటి లక్షణాలు ఉండాలి. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.
వ్యాపారంలో వృద్ధి సాధించాలంటే మొదట్లో పెద్దగా లాభాలు రాకపోయినా, నష్టాలు వచ్చినా ఆశావహ దృక్పథంతో ముందడుగులు వేయాలి. బిజినెస్ లో ఇతరుల సహాయం అవసరం అనుకుంటే నమ్మకమైన వారికి అవకాశం ఇవ్వాలి. బలమైన ఎమోషన్, ఫోకస్, నాలెడ్జ్, సఖ్యత విజయం సాధించడానికి ఎంతో ముఖ్యం. మనం ప్రణాళికను వేసుకోవడంతో పాటు ఆ ప్రణాళికను పక్కాగా అమలుపరిచే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఈ అంశాలన్నీ గుర్తు పెట్టుకుని వ్యాపారంలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది.