ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది సహజంగా జరిగేదే. అయితే కొన్ని మార్పులు సాధారణంగా జరిగితే మరికొన్ని విషయాల్లో మాత్రం మనం మారాల్సి ఉంటుంది. అయితే మార్పు అనే పదం వినగానే చాలామంది భయపడతారు. మార్పును అస్సలు ఇష్టపడని వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే కొంతమందికి మార్పు అనేది సంతోషాన్ని తెచ్చి పెడితే మరికొంతమందికి మాత్రం ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.
చాలా మందికి మార్పు వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నా భయాల వల్ల ఎటువంటి మార్పు లేకుండా వాళ్లకు ఎప్పుడూ తెలిసిన పరిస్థితుల్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఒకే చోట ఉంటే జీవితంలో విజయం సాధించలేం. మారుతున్న కాలంతో పాటు మనం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళితే మాత్రమే విజయం తప్పక సొంతమవుతుంది.
మారుతున్న కాలానికి తగిన విధంగా మనం కూడా మారుతూ ఉంటే మాత్రమే అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోగలుగుతాం. కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవాలన్నా భయపడితే ఆ భయాల వల్ల ఎలాంటి మార్పు లేకుండా తెలిసిన పరిస్థితుల్లోనే ఉండాల్సి వస్తుంది. చాలామంది జీవితంలో వచ్చే మార్పుల ద్వారా సంతోషాన్ని, స్వయం అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు.
కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలో మార్పు జరగదు. మనం మారాలనుకున్నా అనుకున్న ఫలితాలు సొంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం మార్పుల ద్వారా దీర్ఘకాలిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడతామో అప్పటినుండి మనల్ని కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మార్పుని మనం త్వరగా గ్రహించి గౌరవించాలి. రాబోతున్న మార్పులను ముందుగా పసిగట్టి వాటిని ఉపయోగించుకోవడానికి సంసిద్ధం అయి ఉండాలి. అలా ఉంటే మాత్రమే జీవితంలో విజయం సొంతమవుతుంది.