దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మారుతున్న కాలంతో పాటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. పోలీసు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొలువులు, రైల్వే ఉద్యోగాలు, బ్యాంకు జాబ్స్, టీచర్ పోస్టులు, గ్రూప్స్.... ఇతర ఉద్యోగాల్లో సక్సెస్ సాధించడం కోసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. 
 
అయితే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడం అంత సులభం కాదు. సరైన ప్రణాళిక, పుస్తకాల ఎంపికలో జాగ్రత్త, కష్టపడేతత్వం ఉంటే మాత్రమే పోటీ పరీక్షల్లో సక్సెస్ సొంతమవుతుంది. ఎవరైతే సరైన ప్రణాళికతో శ్రమిస్తారో వాళ్లు మాత్రమే సులభంగా సక్సెస్ సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో గెలిస్తే విజేతలుగా నిలుస్తాం. ఓడిపోతే మాత్రం ఆ ఓటమి పాఠంగా మిగులుతుంది. తెలివి తేటలు, ప్రణాళిక, కష్టపడేతత్వం ఉంటే ప్రభుత్వ పరీక్షల్లో సక్సెస్ సాధించడం సాధ్యమే. 
 
గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, పోలీసు నోటిఫికేషన్లలో విజయం సాధించాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల ప్రిపరేషన్ తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. సమాజం, సహచరులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు కూడా ఎదురవుతాయి. అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. 
 
ప్రిపరేషన్ విషయంలో ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా పరీక్షలకు ఒకే పాఠ్యాంశాలు ఉంటాయి. అభ్యర్థులకు సబ్జెక్టుపై సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు గుర్తించే పరిస్థితి ఉంది. అందువల్ల మన బలాలను, బలహీనతలను గుర్తించి సక్సెస్ కోసం శ్రమిస్తే మాత్రం తక్కువ సమయంలో విజయం సాధించడం సాధ్యమేనని చెప్పవచ్చు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: