మనం లక్ష్యాన్ని ఎంచుకుని నూటికి నూరు శాతం శ్రమిస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. మనం అనుకున్న లక్ష్యం నెరవేరితే మనం అదృష్టవంతులం అనే నమ్మకం కలుగుతుంది. అలా జరగని పక్షంలో మనం దురదృష్టవంతులమని భావిస్తూ ఉంటాం. లక్ష్యం కోసం ఊరికే కృషి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరైన సమయంలో సరైన చోట సరైన పనిని చేస్తే మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు.
మనం అవగాహనా శక్తిని పెంచుకుంటే ఎంచుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతాం. మన జీవితం ఎలా ఉందో దానిని అలాగే చూడగలిగి సక్సెస్ కోసం కష్టపడితే తెలివితేటలు అవే వస్తాయి. మనం జీవితంలో ఎంచుకున్న లక్ష్యం కోసం శ్రమిస్తూ సరైన ప్రణాళికతో ముందడుగులు వేస్తే సక్సెస్ సాధించడం సులభమే. అదృష్టం వల్ల సక్సెస్ ఎవరికీ సొంతం కాదు. ఒకవేళ ఎవరికైనా అదృష్టం వల్ల సక్సెస్ దక్కినా ఆ సక్సెస్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.
అదృష్టం అనేది మంత్రం వేసినట్టు అలా జరిగిపోయే అద్భుతం కాదు. అనుకోకుండా మనల్ని ముంచెత్తేదీ కాదు. మనం ఏ విధంగా ఆలోచిస్తామన్న దానిపై అదృష్టం ఆధారపడి ఉంటుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ... మనస్సు మాట వింటూ... విజయం దక్కుతుందనే ఆశతో ముందడుగులు వేస్తూ... ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే సక్సెస్ సొంతమవుతుంది. అంతే తప్ప తమను ఏదో ఒకరోజు అదృష్టం వరిస్తుందనే భావనలో ఉంటే మాత్రం సక్సెస్ ఎప్పటికీ సొంతం కాదు.