
అలాగే మీ జీవితం లో మీరు పాటించవలసిన వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి, ఎందుకంటే మీ వేల్యూ మీ పర్పస్ వైపు తీసుకువెళ్తాయి. ముందుగా ఒకటి తెలుసుకోండి జీవితాన్ని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయలేరు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది ఒకటే ఏం జరిగినా దాన్ని ఎలా డీల్ చేస్తావు అనేది మాత్రమే మీ చేతిలో ఉంది. మీ బ్రెయిన్ చెప్పే అన్ని విషయాలు నిజం కాదు అనే నిజం మీరు తెలుసుకోవాలి.
ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఇది నీ వల్ల కాదు అని మీ జీవితం లో రకరకాల ఉదాహరణలు ఇస్తుందో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అది మిమ్మల్ని భయపెడుతుంది అని, అలాగే అది నిజం నుంచి మిమల్ని అబద్దం వైపు తీసుకువెళ్తుంది అని , అలాంటి సమయం లోనే మీరు భయపడాల్సిన పని లేదు ఆ సమయంలో ఏది నిజమో తెలుసుకుని ఆ నిజం వైపు వెళ్ళాలి అనే ఆలోచన మీకు రావాలి. కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకుని మీ జీవితంలో మరింత ముందుకు వెళ్ళండి.