జీవితంలో చాలామందికి ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఏదో సాధించాలనే ఆకాంక్ష ఉండటం సహజం. కానీ ఆశించిన ప్రతి ఒక్కరు వారి గమ్యాన్ని చేరుకోలేరు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. నిజానికి వారి వారి లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ సమర్థులే కాకపోతే అందుకు కావాల్సిన సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగడం ముఖ్యం. అందుకు కావాల్సిన ధైర్యాన్ని, స్ఫూర్తి ని మదిలో నిలుపుకొని ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది... అప్పుడే కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలం. అప్పుడే మనిషికి పూర్తి సంతృప్తి దొరికి సంపూర్ణం అవుతాడు.

కానీ మరికొందరు ఎటువంటి లక్ష్య లేకుండానే ఏదో అలా..  సర్దుకొని జీవితాన్ని వెళ్లదీస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి లక్ష్యం ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి సమాజంలో గుర్తింపు పొందుతాడు.. తనకంటూ కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. చిరునామా లేని పోస్ట్ కార్డు లాగా, దారం లేని గాలిపటం లాగా జీవితం ఎటు పడితే అటు ఒక నిర్దిష్టమైన మార్గం లేక అలా తిరుగుతూ అర్థం పర్థం లేకుండా మిగిలిపోతుంది. అదేవిధంగా గమ్యం ఉన్న ప్రతి ఒక్కరికి దాన్ని చేరుకోవడానికి ఆసక్తి ఉంటే సరిపోదు ఆచరణలో పెట్టాలి... మధ్యలో వచ్చే ఆటుపోట్లను అధిగమించాలి... ఒక  క్రికెటర్ ఎలా అయితే అన్ని రకాల వేగాలతో వచ్చే బాల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ.... అనుకున్న స్కోర్ ను సాధిస్తాడో అప్పుడే గొప్ప బ్యాట్స్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.

అందుకు తగ్గ ఫలితాన్ని పొందుతాడు. అదేవిధంగా మన లక్ష్య సాధనలో వచ్చే సమస్యలకు భయపడి ఆగిపోకుండా... ముందుకు సాగినప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరుకొని సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ముందుగా లక్ష్యం నిర్ణయించుకోవడానికి అందుకు అవసరమైన 3  ముఖ్య  విషయాలు ఉన్నాయి. మొదటిది ఒక నిర్దిష్టమైన గురిని ఎంచుకోవడం అనగా ఫలానా అని ఖచ్చితమైన లక్ష్యం కలిగి ఉండడం. రెండవది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకోవాలి. మూడవది ఆ లక్ష్యం మన సామర్థ్యానికి తగినదై  ఉండాలి. తలకు మించిన భారం పనికిరాదు. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని చేరుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: