జ్ఞాపకశక్తి అనేది మనిషి జీవన శైలిలో  ప్రధానమైన అంశం అనే చెప్పాలి. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరగడం సహజం. అలాంటిది ఇప్పుడున్న కాలంలో చిన్న పిల్లల సైతం మతిమరుపు సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో జరిగే పనులను పూర్తి చేయడానికి జ్ఞాపక శక్తి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. వృత్తిరీత్యా , విద్య పరంగానూ, నిత్య జీవితంలోనూ ఇలా అన్ని చోట్లా జ్ఞాపకశక్తి అనేది ముడిపడి ఉంటుంది. మనిషి మతిమరుపు కారణంగా కొన్నిసార్లు తమ జీవితంలో విలువైన వాటిని కూడా కోల్పోతుంటారు. ఎంతోమంది జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మతిమరుపును దూరం చేయాలని నానా అవస్థలు పడుతుంటారు. నిజానికి మెదడు చురుగ్గా ఉన్నప్పుడే మనిషి చురుగ్గా ఉంటాడు.

ఇందుకు జ్ఞాపకశక్తి కూడా దోహద పడుతుంది. అలాంటి జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలంటే పాటించవలసిన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం, మతి మరుపు కారణంగా ఎదుర్కొనే సమస్యలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలుసుకుందాం. వ్యాయామం చేయడం వలన జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన ఫిట్‌నెస్‌ లేకపోవడం వలన కూడా  జ్ఞాపక శక్తి తగ్గుతుందని  పరిశోధకులు గుర్తించారు. శారీరక ఫిట్‌నెస్‌ మెరుగైతే మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఎరోబిక్స్ చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి మెరుగు అవుతుందని  పరిశోధనలో తేలింది.

ఎరోబిక్స్ చేయడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, డిమెన్షియా వంటి సమస్యలు దరిచేరవు. తరచూ వీటిని చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలుపుతున్నారు.
అదేవిధంగా మన నిత్యజీవితంలో చక్కెర వాడకాన్ని తగ్గించడం, యోగా, ధ్యానం  కానీ రెగ్యులర్ గా చేస్తూ ఉండటం, సమయానికి నిద్రపోవడం, ఆల్కహాల్ కు దూరంగా ఉండడం.... ఇవన్నీ పాటించడం వలన జీవితంలో మనకు ఎంతో అవసరమైన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: