జీవితం అనేది ఒక చిన్న నీటి బుడగ లాంటిది. ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించాలి. ఈ జీవితానికి మరియు మన మనసుకు ఎటువంటి పరిమితులు ఉండవు. దీనియొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకోవాలంటే, రోజు వారి జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవడమే అవుతుంది. ఈ జీవితంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రతి ఒక్కటి మనమే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనకున్న ఈ చిన్న జీవితంలో ఏ మాత్రం సమయాన్ని వృధా చేయకుండా..దీనికి బదులుగా అందరి పట్ల వినయంగా ఉండాలి, అందరితో సహనాన్ని కలిగి ఉండాలి, ఇతరులతో మర్యాదగా మెలగాలి. జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలి. ఈ లక్షణాలు మన పాత్రలో చెరగనివి అయినప్పుడు, మన స్వాభావిక జ్ఞానోదయాన్ని మేము అభినందిస్తున్నాము.
ఇలా కాకుండా మీరు కనుక స్వార్ధంగా భావించి కొంచెం అజాగ్రత్తగా, అహంకారంగా, మూర్ఖంగా మరియు సోమరితనంగా మారినట్లయితే ప్రజలకు మీరు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుచేత మీ జీవితం మీకు చేదుగా మారుతుంది. ఈ జీవితం అమోఘం...మంచి పనుల కొరకు ఉపయోగించండి. జీవితంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి. ఎదుటివారు వృద్ధిలోకి వచ్చినప్పుడు మీలో అసూయను పెంచుకోకండి. వీలైతే అభినందించండి. లేదంటే సైలెంటుగా ఉండిపోండి..