ఇది చాలు మనము అనుకున్న పని జరగకపోవడానికి...మనము ఎంత ప్రయత్నించినా మన ఆలోచనా విధానం దానిని జరగనివ్వదు. అయితే వాటిని మనము ఎలా నియంత్రించగలము అనే విషయం గురించి కొన్ని కీలక విషయాలను ఇప్పుడు చర్చించుకుందాము. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలను తు చ తప్పకుండా పాటించాలి. అవేమిటంటే సానుకూల శక్తితో మీ మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వేళ మీకు ప్రతికూల ఆలోచనలు వచ్చి మీ మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తే, మీ మనసును పూర్తిగా పాజిటివిటీతో నింపండి. మీ మనస్సు స్పందిస్తే, మీరు సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు; లేకపోతే, మీరు మీ ప్రతికూల ఆలోచనలకు లొంగిపోతారు.
ఒక వ్యక్తి తన మనస్సు స్థిరంగా ఉండి, తన కోరికలన్నింటినీ త్యజించి, ఆత్మలో సంతృప్తిగా ఉంటే దృష్టి సారిస్తాడు. ఇలాంటి వాటిని పారదోలడానికి ఎక్కువ సమయాన్ని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సంతోషంగా ఉండడానికి గల కారణాలను అన్వేషించండి. మీరు పని చేసే ప్రదేశంలో కూడా ఎక్కువ సత్యంను ఆనందంగా గడపండి. నవ్వుకు ఎంతటి కష్టాన్నైనా పోగొట్టే శక్తీ ఉంది. కాబట్టి కృతజ్ఞత మరియు ప్రశంస వంటి భావోద్వేగాలను వ్యక్తపరచడం సానుకూల భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది, ప్రధానంగా ఆనందం.కాబట్టి మీ విజయాలకు అడ్డుపడుతున్న ప్రతికూల ఆలోచనల నుండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, మీకు విజయాలు దక్కుతాయి.