ప్రతి ఒక్కరి జీవితంలో అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనది వారి సంతానం. అలాగే వారి పిల్లల భవిష్యత్తు. తల్లిదండ్రులు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. అదంతా వారి పిల్లల కోసమే. అలాంటిది  పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం అంటే చిన్న విషయమేమీ కాదు. పిల్లల్ని పెంపకం అంత సులభం కాదు. చిన్నప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారో, ఇలాంటి బుద్ధులు వారి తల్లిదండ్రులు వారికి నేర్పుతారో...ఆ ప్రభావమే వారి జీవితంపై పడుతుంది. వారి భవిష్యత్తు ఎంతో చక్కగా ఉండాలంటే, పిల్లల చిన్నప్పటి నుండే వారిని ఒక క్రమ పద్ధతిలో పెంచాలి.

జీవితంలో వారికి కొన్ని జాగ్రత్తలను తప్పక నేర్పించాలి. ఆ తరువాత వారు అవి పాటిస్తున్నారా లేదో చెక్ చెయ్యాలి. పిల్లల్ని మరీ అంత కటువుగా పెంచరాదు, వారితో స్నేహంగా మెలగాలి. అలాగని మరీ .. వారి ఇష్టానుసారం జీవించడానికి చనువు ఇవ్వకూడదు వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూనే, మరోవైపు వారికి ఎవరితో ఎలా మెలగాలో.. ఎలా వ్యవహరించాలో నేర్పాలి. అదే విధంగా ప్రతీ విషయంలోనూ పాజిటివ్ గా స్పందించడం, చురుకుగా ఆలోచించడం వంటివి తెలపాలి. ముఖ్యంగా మన దేశంలో లింగ భేదాన్ని చూపరాదు.. కూతురు కొడుకు ఎవరైనా సరే ఇద్దరినీ ఒకే లాగా చూడటం ఒకేలాగా పెంచడం ఎంతో ముఖ్యం. అప్పుడే వారు కూడా అదే పద్ధతి అలవర్చుకుంటారు.

ముఖ్యంగా పిల్లలకు  విద్య యొక్క ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి వారికి విద్యపై ఆసక్తి పెరిగే పనులు చేయాలి. తమ కంటూ ఒక లక్ష్యం ఉండేలా... వారిని ప్రోత్సహించాలి. లక్ష్యాన్ని చేరుకునేలా వారిని అనుక్షణం గైడ్ చేస్తూ ఉండాలి. ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని ముందు ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలియచేయాలి.  ఇలా పలు రకాల జాగ్రత్తలను పిల్లలను పెంచే సమయంలో అనుసరించడం ఎంతో ముఖ్యం. అప్పుడే పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: