
దీనితో విద్యార్థుల గుండెల్లో భయం మొదలయింది. వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన పడుతున్నారు. కానీ ఇలా భయపడడం వాళ్ళ ఉపయోగం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుని చదివితే ఆయా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రముఖ విద్యా నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వెళితే ఎంత సిలబస్ ఉన్నా కానీ మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు. టైం టేబుల్ లేకుండా చదివితే ఎంత సిలబస్ పూర్తయింది?, ఇంకెంత మిగిలింది? అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పుతుంది.
మీరు ఎంత చదివారు అన్న విషయాన్ని పక్కన పెడితే, పరీక్షల్లో ఎంత రాశారు? ఎలా రాశారు ? అన్నదే లెక్కలోకి వస్తుంది. దీని కోసం ముందుగానే కొన్ని మోడల్ పేపర్లను తీసుకుని పరీక్ష లాగా ప్రాక్టీస్ చేస్తే మంచిదని నిపుణుల అభిప్రాయం. మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యమైన మరియు పరీక్షల్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలను మొదటిగా చదవడం చాలా ముఖ్యం. ఒత్తిడి లేని మనస్సు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెబుతుంటారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేయవచ్చు. ఇవన్నీ కాకుండా పరీక్షల మీద పాజిటివ్ గా ఉండాలి. పరీక్షలో పాస్ అవుతామా లేదాయే ఫెయిల్ అయితే ఎలా అనే ఆలోచనలను పక్కన పెట్టెయ్యాలి.