ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అర్ధమవుతోంది. అయితే కేవలం పురుషుల్లోనే ఇలా జరగడానికి కారణం ఏమిటని చూస్తే...మామూలు సమయంలో జాబ్ కి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికొస్తారు హ్యాపీగా భార్యతో ఉంటారు. కానీ ఇప్పుడు 24 గంటలు భార్యతోనే ఉండాలి. దీనితో అసహనం పెరిగిపోతోంది. కానీ ఇలా చెయ్యడం చాలా పొరపాటు అని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఒకరికి ఒకరు గౌరవంగా మెలుగుతారో..అప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ఆ గౌరవమే మీ మధ్యన బంధాన్ని బలంగా చేస్తుంది.
ఎప్పుడైతే మీ భార్యకు కలిగే నొప్పిని మీ నొప్పిగా ఫీల్ అవుతారో ఇంకోసారి మీరు ఆమెను ఇబ్బంది పెట్టలేరు. ఇది ఇలాగే కొనసాగిస్తే మీరు ఇంకొకరికి స్ఫూర్తిగా ఉండొచ్చు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. ముందుగా ఒకరినిమించి ఒకరు ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి. కేవలం ఇది కూడా మీకు ఒక శిశువు జన్మించక ముందు వరకే, తరువాత మీ బిడ్డతో గడపడానికే మీకు సమయం సరిపోదు. ఇలా చిన్న చిన్న విషయాలను తెలుసుకోలేక ఎంతోమంది చిన్న వయసులోనే తమ జీవితాలను కోల్పోతున్నారు. మాములుగా సినిమాలో కొన్ని డైలాగులు వస్తుంటాయి....వీలైతే ప్రేమిద్దాం ..మహా అయితే తిరిగి ప్రేమిస్తారు...అన్నట్లు ప్రేమించండి.