మనిషిగా మనం పుట్టాక అన్నింటికీ సిద్దపడి ఉండాలి. మనము ఎప్పుడూ సుఖాల్లో ఉండము. అలాగే మనతో ఎప్పుడూ కష్టాలు అంటుకుని ఉండవు. అందుకే ఎప్పుడూ సుఖాలకే అలవాటు పడిపోయి దుఃఖం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగితే, మీ జీవితంలో మీకు తెలిసే చాలా తప్పులు చేసేస్తారు. అందుకే అప్పుడప్పుడయినా మీ జీవితంలో వచ్చిన దుఃఖాన్ని భరించి, చేసిన తప్పులని తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అది ఏదైనా కావొచ్చు..తన గురించి కావొచ్చు లేదా తన కుటుంబం గురించి కావొచ్చు. అయితే కొంతమంది మాత్రం ఇలా ఏ ఉద్దేశ్యం లేకుండా బ్రతుకుతూ ఉంటారు.
అలా కాకుండా మీ జీవితానికి ఉన్న పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలి, మీ జీవితం లో మీ పర్పస్ ఏంటో మీకు తెలియకపోతే ఇప్పుడే ఆలోచించండి, అప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీకు ఒక్క అవగాహన వచ్చేస్తుంది, అలాగే మీ జీవితం లో మీరు పాటించవలసిన విలువలు ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మీ విలువలు మీ పర్పస్ వైపు తీసుకువెళ్తాయి. ముందుగా ఒకటి తెలుసుకోండి జీవితాన్ని ఎప్పుడూ మీరు కంట్రోల్ చేయలేరు, ఎప్పుడు ఏమి జరగనుందో మనకు తెలియదు. మీ ఛాయస్ మీ దృష్టిలో పెట్టుకుని దానికి ఏమి కావాలో అది చేస్తూ ఉంటే మీ లైఫ్ సింపుల్ గా ఉంటుంది, మీ జీవితంలో ఎక్కువ ఛాయస్ లు ఉంటే మీ లైఫ్ కష్టంగా అవుతుంది. అందుకే ఎప్పుడు తక్కువ ఛాయస్ లు పెట్టుకోండి. అది లేదు ఇది లేదు అనే ఆలోచనలో ఉండకండి. ఉన్నదానితో తృప్తి పడడం అలవాటు చేసుకోండి.
ఈ విధమైన వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మిమల్ని రక్షిస్తుంది. అంతే కానీ ఆదాయానికి మించిన ఖర్చులను పెట్టుకుని ఇబ్బంది పడడం కొంచెం ఇబ్బందిగా మారొచ్చు. ఏది ఏమైనా జీవితంలో ఏ విధమైన ఆశయం లేకుండా ఉండడం సరి కాదు. సో పైన చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుంచుకుని పాటిస్తే మీరు జీవితంలో ఒక గౌరవంతో బ్రతకగలరు.
మరింత సమాచారం తెలుసుకోండి: