ప్రతి ఒక్కరూ బ్రతకడానికి జీవనోపాధి అనేది ఎంతో ప్రదానం. చిన్నదైనా పెద్దదైనా ఎదో ఒక పనో, ఉద్యోగమో, వ్యాపారమో చేయనిదే మన జీవితం గడవదు. ఇలా ప్రతి ఒక్కరికీ జీవనోపాధి తప్పనిసరి. ముఖ్యంగా ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. నేటి తరంలో ఉద్యోగమే చాలా అవసరం. అయితే చాలా మంది మొదటి సారి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి వచ్చినపుడు చాలా కంగారు పడిపోతుంటారు. ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ కి నచ్చే విధంగా ఎలా నడుచుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలని ఎంతో సతమతమవుతుంటారు. అయితే మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళడం మొదటి సారి కావచ్చు, లేదా రెండోసారో, మూడోసారో కావచ్చు. కానీ ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు కొన్ని మెళకువలను తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం.
అవేంటో ఇప్పుడు చూద్దాం.

* ఇంటర్వ్యూ డేట్ కంటే ముందు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి.

* ముందుగా మీ సర్టిఫికెట్స్ ను  అవసరమైన డాక్యుమెంట్స్ ను, రెజ్యూమ్ ను ఇలా అన్నిటినీ ఒక క్రమ పద్దతిలో ఉంచుకోవాలి.

* మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళే కంపెనీ గురించి ముందుగా అన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.

* ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది మీరు ఎంచుకున్న ఉద్యోగాన్ని బట్టి ఎంతో కొంత మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి  అందుకు సంబంధించిన విషయాలను ముందుగా ప్రాక్టీస్ చేయడం మంచిది.
 
*ఇంటర్వ్యూ కి వెళ్లేముందు మీ అప్పీయరెన్స్ బాగుండేలా  చూసుకోవాలి. అంటే మీ హైర్ కట్, డ్రెస్సింగ్ స్టైల్ ను చక్కగా ఉండేలా చూసుకోండి.

*ఇంటర్వ్యూ లో మీరు మాట్లాడేటప్పుడు నేరుగా అవతలివారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. దిక్కులు చూడకూడదు.

* అదే విధంగా మీ మాటలు స్పష్టంగానూ సూటిగానూ ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

* ఇంటర్వ్యూ ముందు రోజు చక్కగా టైం కి నిద్రపోవాలి. అప్పుడే మీరు ఫ్రెష్ గా ఉంటారు.

* ఇంటర్వ్యూ సమయానికంటే పదినిమిషాల ముందే మీరు చేరుకోవాలి, లేట్ గా వెళ్ళరాదు.

* మీరు ఆ ఉద్యోగానికి సమర్థులు అన్న ఉద్దేశ్యాన్ని ఎదుటివారికి అనిపించేలా మీ సమాధానాలు చక్కగా ఉండాలి.

ఇలా చేసినట్లయితే మొదటి ఇంటర్వ్యూ లోనే మీకు ఉద్యోగం వస్తుంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: