మరి కొందరు ఎత్తైన ప్రదేశాలను చూస్తే చాలు భయంతో, ఇలా చాలా రకాల భయాలు ఉంటాయి. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే భయపడితే ఏ చిన్న సమస్య నుండి కూడా మనము బయటపడలేము. ఇది వాస్తవం. ఇంకా కావాలంటే ఆ భయమే మనల్ని ఇంకా పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. సాధారణముగా భయం అనేది అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సార్లు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మన చుట్టూ ఉన్న మీడియా మిత్రులు ఒక వార్తను రకరకాలుగా చెబుతూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. కానీ ఎంత భయాందోళనకు సంబంధించిన విషయం లేదా వార్త అయినా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండాలి.
మాములు ఆరోగ్యవంతులయిన మనుషులు భయపడినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనుక భయపడితే, వారికి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. దీనికి చాలానే సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కరోనా సమయంలో చనిపోయిన వారిలో 25 శాతం మంది వరకు కేవలం భయం వల్లనే చనిపోయి ఉంటారు. హాస్పిటల్స్ లో డాక్టర్స్ చెబుతున్న విషయాల వల్ల కావొచ్చు, లేదా టీవీలలో చూసే వార్తల వల్ల కావొచ్చు కరోనా పేషెంట్లు వైరస్ పట్ల భయంతో వణికిపోతున్నారు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు అనే భయంతోనే జీవిస్తున్నారు. కాబట్టి అందరూ భయాన్ని వీడండి. కరోనా కాదు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా సరే మీలో ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యమే మీ ఆయుధం.