కానీ ఇక్కడే మీకు ఓర్పు, సహనం, ఆత్మ విశ్వాసం అవసరం. ఒకటి రెండు సమస్యలకే కృంగిపోకూడదు. ఓటమిని అంగీకరించకూడదు సహనంతో ..ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి, మనమనుకున్న దాన్ని సాధించాలి. కానీ ఇక్కడ ఒత్తిడికి లోను కాకూడదు మన ఆశయం మన బలం కావాలి కానీ బలహీనం కాకూడదు. ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదు, పదే పదే దాని గురించే ఆలోచిస్తూ మనశ్శాంతిని కొల్పోకూడదు. మన ఆశయాన్ని మరిచిపోకూడదు. కానీ దాన్నే తలుచుకుంటూ ఎలా పరిపూర్ణం చేసుకోవాలి తెలియక మానసికంగా కృంగిపోకూడదు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. దానికి మన కృషికి అదృష్టం తోడైనపుడు తప్పకుండా విజయం మన సొంతం అవుతుంది.
ఏది సాధించాలన్నా సరైన ప్రయత్నం చేయనిదే ఎటువంటి ఫలితం లభించదని అర్థం చేసుకోవాలి. ఒకసారి మన ప్రయత్నం విఫలమైతే, అంతటితో మన సామర్ధ్యాన్ని తేలిక చేసుకోకూడదు. పదే పదే ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే చిన్న ఆశ అయినా పెద్ద ఆశయం అయినా తప్పక నెరవేరుతుంది. కాబట్టి ఏదీ ఊరికే ప్రాప్తించదు అని తెలుసుకోండి.