పిల్లల చిన్న వయసు నుంచి కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి అవి తల్లిదండ్రులు తీరుస్తారు. కానీ వారు కోరే ప్రతి ఒకటి వారికి అందించడం తప్పే అవుతుంది. వారికి ఎంత అవసరమో అంతవరకే ఇవ్వాలి. ఎలా మన కోరికలను అదుపులో ఉంచుకోవాలో వాళ్ళకి చిన్నప్పటినుండి నేర్పించడం మంచిది. నేటి సమాజంలో యువత కోరికలు ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నిటికీ పరిమితి అనేది ఉండడం అవసరం. మంచి చెడు అనేది వారి ఆలోచనల బట్టే ఉంటుంది. కాబట్టి వారి ఆలోచనా విధానం సరిగా ఉండేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి.
అదే యువత భవిష్యత్తు మంచి బాటలో నడిచేలా చేస్తుంది. ఏది మంచి ఏది చెడు ఎంతవరకు మన కోరికలు అనేది ఉండాలి అన్న విషయాలపై వారికి చక్కటి అవగాహన కలుగుతుంది. అప్పుడే వారి జీవితం సవ్యంగా నడుస్తుంది. దేని ద్వారానే వారు మంచి మార్గంలో వెళుతున్నారా లేదా చెడు మార్గంలో వెళుతున్నారా తెలుస్తుంది. కనుక మనసుని అదుపులో ఉంచుకోవాలి. తద్వారా కోరికలు కూడా అదుపులో ఉంటాయి లేదంటే మానవుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇది మీ జీవిత పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. నేర్చుకోవడం కాదు ఆచరణలో పెట్టడం అనేది చాలా ముఖ్యం.