ఆ బలమే మనకు వెన్నంటే ఉంటూ మన లక్ష్యాన్ని సాధించగలమన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏమిటంటే, మీరు ఎక్కే మొదటి మెట్టే విజయాన్ని అందించాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఎవ్వరికీ మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కుతుందని చెప్పలేము. ఒకవేళ అలా జరగక పోయినా నిరుత్సాహ పడకుండా ముందడుగు వేయాలి. అలాగే కొందరు రెండు మూడు సార్లు ప్రయత్నించి, ఇక మనం అనుకున్నది సాధించలేమని భావించి వారి లక్ష్యాలను మార్చుకుంటారు. దొరికిన అవకాశాలతో అడ్జస్ట్ అవ్వాలని ఆలోచిస్తుంటారు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో తప్పు లేదు.
కానీ మన లక్ష్యాన్ని మాత్రం మార్చుకోకూడదు వదిలి పెట్టకూడదు. అనుకున్నది సాధించే వరకు ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా మనం గెలుస్తామన్న ఆలోచనలే బలంగా మారుతాయి. అందుకే ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడే మార్గం కూడా సరిగ్గా ఉంటుందని పెద్దలు అంటుంటారు. మనము ఆలోచించే విధానంలో మార్పు వస్తే ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా మనకు అనుకూలంగా మార్చుకుని విజయానికి సోపానాలుగా చేసుకొని ముందుకు సాగగలము. పై విషయాలన్నీ బాగా అర్ధం చేసుకుని పాటిస్తే విజయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.