స‌మాజంలో మ‌నిషి స్వ‌యం కృషితో మ‌హామ‌నిషిగా మారొచ్చేమో.. కానీ, మ‌న‌సు మాత్రం అదేవిధంగా మారాల్సిన అవ‌స‌రం లేదు. తాను సంపాదించుకున్న సొమ్మును సొంత లాభం కొంత‌ మానుకుని స‌మాజం కోసం వెచ్చించే వారు నూటికి ఒక్క‌రు కూడా క‌నిపించ‌ని రోజులు న‌డుస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో.. మ‌హామ‌నిషిగా ఎదిగిన కోటిరెడ్డి స‌రిప‌ల్లి. కోటి గ్రూప్ ఆఫ్ సంస్థ‌ల చైర్మ‌న్ అయిన ఆయ‌న స‌మాజ సాధ‌క బాధ‌కాల‌ను అర్ధం చేసుకోవ‌డంలో ముందున్నారు. మ‌హామ‌నిషిగా ఎదిగినా.. మ‌ట్టిమ‌న‌సుతో ఆయ‌న అంద‌రికీ అండ‌గా ఉంటున్నారు. తాను సంపాదించిన ప్ర‌తి రూపాయిలోనూ కొంత మొత్తాన్ని స‌మాజానికే తిరిగి ఇచ్చేస్తూ.. త‌న మ‌ట్టిమ‌న‌సును చాటుకుంటున్నారు కోటిరెడ్డి.
గుడివాడ ద‌గ్గ‌ర్లో ఓ ప‌ల్లెటూరు జ‌నార్థ‌న‌పురం.. చాలా మందికి తెలియ‌దు. ఇలా ఎవ‌రూ ఊహించ‌ని ఓ చిన్న గ్రామం నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన కోటిరెడ్డి.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా తాను స్థాపించిన  కంపెనీల ద్వారా.. కోట్లాది మందికి సేవ‌లు అందిస్తున్నారు. తాను సంపాయించిన సొమ్ములో 33 శాతం నిధుల‌ను సమాజ సేవ‌కే వినియోగిస్తున్నారు.  ఆయ‌న వ్యూహం ఎంత ప‌దునో.. ఆయ‌న ఆలోచ‌న‌,ఆయ‌న మ‌న‌సు అంతే మెత్త‌న‌! బాధ్య‌త అంటే డ‌బ్బులు ఇచ్చి వ‌దిలేయడం కాదు.. బాధ్య‌త అంటే.. అంతా తానై వ్య‌వ‌హ‌రించ‌డం, అన్ని రూపాల్లోనూ త‌న ప్ర‌తిబింబం క‌నిపించడం.. ఇదే ఆయ‌న‌ను స‌మాజంలో ఒక ప్ర‌ముఖ వ్య‌క్తిగా .. మ‌న‌స్సున్న‌ శ్రీమంతుడిగా నిల‌బెట్టింది.
త‌న స్వ‌గ్రామం అభివృద్ధికి త‌న వంతుగా కృషి చేస్తున్నారు. అలాగే ఏపీలో ప‌లు గ్రామాల్లో చిన్న స‌మ‌స్య‌ల‌కు ఆయ‌న త‌న వంతుగా సాయాలు చేస్తూనే ఉన్నారు. త‌న కోసం తాను జీవిస్తే.. పెద్ద‌గా చెప్ప‌డానికి ఏముంటుంది?  కానీ, తాను జీవిస్తూ.. స‌మాజాన్ని జీవింప‌జేస్తున్న వారు ఎవ‌రైనా ఉంటే.. వారి గురించి చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి వారిలో కోటిరెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. నేటి స‌మాజానికి ప్ర‌ధాన స‌మ‌స్య గా ఉన్న ప్ర‌జారోగ్యంపై ఆయ‌న `హైఫై ఇండెక్స్` పేరుతో చేస్తున్న ప‌రిశో ధన‌లు నూతన స‌మాజావిష్క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయిస్తోంది. అదే స‌మ‌యంలో `పినాకిల్ బూమ్స్` ద్వారా చిన్నారుల‌కు అందిస్తున్న సేవ మ‌రో కోణం. బుద్ధి మాంద్యం తో ఇబ్బంది ప‌డే చిన్నారుల‌కు ఒకప్పుడు స‌రైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. అంతేకాదు, ప‌లు ర‌కాల ట్రీట్‌మెంట్ల‌కు ప‌లు ప్రాంతాల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. ఈ ప‌రిస్థితిలో అల్లాడుతున్న వారికి ఆద‌ర్శంగా మారారు కోటిరెడ్డి దంప‌తులు.
హైద‌రాబాద్‌లోనే పినాకిల్ బూమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అన్ని ర‌కాల చికిత్స‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకువ‌చ్చా రు. అంతేకాదు, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు వాటిని చేరువ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పినాకిల్ బ్లూమ్ బ్రాంచ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుద్ధి మాంద్యంతో జీవితాన్ని దుర్భ‌రంగా గ‌డుపుతున్న చిన్నారుల‌కు సేవ‌లు అందిస్తూ.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు పూయిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. ఎక్క‌డా గ‌ర్వం పొడ‌సూప‌కుండా.. మ‌హామ‌నిషి అయినా.. మ‌ట్టి మ‌న‌సుతో స‌మాజానికి చేస్తున్న సేవ‌.. కోటిరెడ్డిని మ‌హొన్న‌త శిఖ‌రంపై నిల‌బెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: