* మీ చుట్టూ ఉన్న వారు మీలో ఏదైనా ఒక పొరపాటును గమనించి చెబితే, దానిని మీరు స్వీకరించగలగాలి. అంతే కానీ నాలో తప్పు మీరేంటి చెప్పేది అంటే మీ మధ్య అసమానతలు మొదలవుతాయి. వీలైనంత త్వరలో వారికీ మీరు శత్రువుగా మారిపోతారు.
* మీకు ఎవరైనా సలహా ఇస్తే మంచి అయినా, చెడు అయినా మొదట వినండి. తర్వాత వారు చెప్పింది పాటించాలా లేదా అన్నది మీ స్వంత ఆలోచన. అంతే కానీ వారు చెబుతున్న సమయంలో నిర్లక్ష్యంగా ఉండకండి.
* మీరు మీ చుట్టూ ఉన్న వారితో ఎక్కువ సమయాన్ని గడపండి. వారితో సంతోషంగా మెలగండి. తద్వారా మీ మధ్య మంచి సంబంధాలు మెరుగుపడతాయి.
* ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయండి. అదే విధంగా మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ స్నేహితులను సాయం అడగండి. ఇలా ఇవ్వడం తీసుకోవడం ద్వారా మీ మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి.
* అన్నింటికన్నా ముఖ్యమైనది మీ చుట్టూ ఉన్న వారిపై పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి. ఈ లక్షణం వలన కూడా మానవ సంబంధాలు మెరుగవుతాయి.
మీలో ఎవరైనా మానవ సంబంధాలను పెంచుకోవడంలో వెనుకబడి ఉంటే ఈ విషయాలను అనుసరించి, వీటిని పెంపొందించుకోండి. మీ జీవితంలో ఏది సాధించాలన్నా మీకోసం మీ వైపు నిలబడే వారు నలుగురు ఉండాలి. వారిని మీకోసం ఆలోచించేలా చేయడంలో మీదే పూర్తి బాధ్యత.