సాధారణంగా మన రోజువారీ జీవితంలో ఎన్నెన్నో పనులతో బిజీగా ఉంటాము. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే పనికి సంబంధించి ఇంకా బిజీ గా ఉంటారు. టైం కు అనుకున్న పని కాకపోతే కంపెనీ నుండి తీవ్ర ఒత్తిడి ఉండడం సహజమే. ఇలా ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి, సదరు ఆపనిని తొందరగా చేయడానికి మరింత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే పర్వాలేదు. కానీ తరచూ జరిగితే మాత్రం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అయితే ఇటువంటి ఒత్తిడి నుండి బయటపడాలంటే ఏమి చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము.

ఈ ఒత్తిడికి సంబంధించి బేక్ మాన్ ఇన్సిస్ట్యూట్ ఒక పరిశోధన చేసి పలు కీలక విషయాలను "జర్నల్ అఫ్ వుమన్ అండ్ ఏజింగ్" లో తెలిపింది.  

ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న అమ్మాయిలకు ఉపయోగపడే విషయాలను ఈ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఎవరైతే ఒత్తిడిలో ఉంటారో వారు వారి స్నేహితులతో ఆ విషయాలను పంచుకోవడం వలన ఒత్తిడి నుండి బయటపడతారని తెలిపింది. అంతే కాకుండా వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుందని వీరు వెల్లడించారు.  మనము ఒత్తిడికి లోనయినప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోను విడుదలవుతుందని వేరు తెలిపారు. అయితే ఈ హార్మోన్ స్నేహితులతో తమ బాధలను పంచుకుంటున్న యువతులు మరియు వృద్దులలో అతి తక్కువగా విడుదల అవుతోందని నిర్దారించారు. దీనిని బట్టి ఈ పరిస్థితులలో వారిపైనా ఒత్తిడి ప్రభావం అంతగా ఉండదని తెలుస్తోంది.

అయితే ఎన్ని పరిశోధనలు చెప్పినా, ఎంతమంది శాస్త్రజ్ఞులు వివరించినా ఈ విషయం వాస్తవం. ఎవ్వరికైనా మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు, దానినే లోచిస్తూ ఒత్తిడికి లోనవడం వలన ఉపయోగం ఉండదు. అదే ఆ బాధను మీరు పక్కవారితో షేర్ చేసుకోవడం వలన మీకు ఉపశమనం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని ఆచరించాల్సిన అవసరం ఉంది.  ఈ రోజుల్లో వివిధ కారణాల వలన కలిగే ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతోమంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీలో ఎంత బాదున్నా వేరొకరితో పంచుకోండి. ఏ బాధయినా చంపేంత కష్టమైనదైతే కాదని గ్రహించండి. మీరు బ్రతకండి నలుగురిని బ్రతికించండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: