మనిషిగా జన్మించిన తర్వాత కాలానుగుణంగా మీరు పెరిగే కొద్ది మీలో శారీరక మార్పులతో పాటుగా మానసికమైన మార్పులు పెరుగుతూ ఉంటాయి. కానీ కొందరిలో మంచి లక్షణాలు ఉండవచ్చు మరి కొందరిలో చేదు లక్షణాలు కలిగి ఉండవచ్చు. ఇలా మంచే లేదా చేదు అనేది మీరు పెరిగిన పరిసరాల మీదనే ఆధారపడి ఉంటుంది. మీ చుట్టూ మంచి వాళ్ళు ఉంటే, మీరు మంచి వ్యక్తిగా పెరుగుతారు. లేదా చెడ్డవారు ఎక్కవగా ఉంటే చెడ్డవారిగా మారుతారు. అయితే ఇది కొంత వయసు వరకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు మీకు చిన్నతనంలో ఎటువంటి విషయాలు తెలియవు కాబట్టి, మీరు ఎవరితో అయినా మాట్లాడుతారు. అలాగే వారితో కలిసి ఉంటారు. చెడు లేదా మంచిని మీరు గ్రహించలేరు. కానీ ఎప్పుడైతే మీకు కొంతవయసు వస్తుందో, మంచి చెడులను ఆలోచించగలరో అప్పటి నుండి మీరు బ్రతికేది నిజమైన జీవితం అని గుర్తుంచుకోండి.

అక్కడ నుండి ప్రతి ఒక్కటి మీరే నిర్ణయించుకోవాలి. మీ తల్లితండ్రులు చిన్నప్పటినుండి మంచి అలవాట్లను అలవరిస్తే పర్వాలేదు. కానీ కొంతమందికి సమాజం గురించి తెలియక లేదా మీ తల్లితండ్రులకు మంచి చెడుల పట్ల సరైన అవగాహన లేకపోయినా మీ బాధ్యత మరింత పెరుగుతుంది.

మీరు తినే తిండి నుండి మీరు మాట్లాడే ఫ్రెండ్స్ వరకు ప్రతి ఒక్కటి మీకు మంచి చేసేదిలా ఉండాలి.

మంచి తిండి తీసుకోకపోతే అనారోగ్యం వస్తుంది. ఈ ఫీలింగ్ మీకు కలగాలి. అప్పుడే మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. మంచి ఆహారం అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తినేది కాదు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం అని గుర్తించండి.

మీరు స్కూల్ కి వెళ్ళాక స్నేహితులను మీరే ఎంచుకోగలగాలి. ఎవరు అయితే మీ ఆలోచనాలకు సరిపోతారో, మీ లాగా మంచి వారై ఉంటారో అలాంటి వారినే సెలెక్ట్ చేసుకోవాలి.

ప్రతి రోజూ లేచినప్పటి నుండి పడుకునే వరకు మీరు మంచి పనులనే చేయాలి. మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. చిన్న వయసు నుండి మీరు మంచి అలవాట్లను పెంచుకుంటే పెద్దయ్యాక మీరు ఎన్నో విజయాలను సాధించడానికి  అవి ఉపయోగపడుతాయి.

పై విషయాలను పెద్దలు అర్ధం చేసుకుని మీ పిల్లలకు మంచి పద్దతిలో పాజిటివ్ గా చెప్పగలిగితే ప్రతి ఒక్క పిల్లవాడు మంచిగా మారడానికి ఆస్కారం ఉంటుంది.  అలాగే పెద్ద పిల్లలు కూడా వీటిని తూచా తప్పకుండా పాటించగలిగితే అంతా ఆమంచి జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: