ఎందుకంటే ఎంతోమంది విజయం అనే గర్వం తలకెక్కి మనకిక తిరుగులేదు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వీరు ఆనందంగా ఉంటారు. అలాగే ఓడిపోయిన వారు చాలా కృంగిపోతూ ఉంటారు. ఇక మన జీవితం అయిపోయింది అన్న భావన వారిలో ఉంటుంది. ఎందుకంటే వారు గెలవాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక లోపం కారణంగా ఓటమి వారిని విడిచి వెళ్ళదు. ఇలాంటి వారు ఆనందంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలాగా బాధగా కనిపిస్తారు. వీరిద్దరి తీరులో ఎలాంటి మార్పు ఉండదు. గెలుపు మరియు ఓటమిల గురించి ఆలోచించడానికే వారి జీవితం సరిపోతుంది.
కానీ కొంతమంది అటు గెలుపును మరియు ఓటమిని సమానంగా ట్రీట్ చేస్తారు. అంటే గెలిచినప్పుడు ఓవర్ గా సంతోషపడడం కానీ లేదా ఓటమి చెందినప్పుడు తీవ్రంగా కృంగిపోవడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఈ గెలుపు మరియు ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదని వారికి తెలుసు. కాబట్టి నిత్యం సంతోషంగా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతో ఉంటారు. ఇంత చిన్న విషయం తెలియక బయట చాలా మంది కొట్టుకు చేస్తుంటారు. అలాంటి వారంతా ఈ ఆర్టికల్ చదివి ఆనందంగా ఉండగలరు.