ప్రపంచంలో ఏ ఒక్కరికీ కష్టపడనీదే ఫలితం దక్కదు. ఇది సత్యం. అంతే కాకుండా ఆ ఫలితం కోసం మనం పడే శ్రమ ఎప్పుడూ వృధా కాదు. శ్రమవల్ల లభించేదే విజయం అనే బహుమానం. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం. కానీ చాలామంది నేను జీవితంలో అది సాధించాలి. ఇది సాధించాలి అని అనుకుంటారు కానీ అందుకోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయరు. దీనికి ప్రధాన కారణం మొదటి ప్రయత్నంలోనే వారికి విజయం అందలేదని బాధ, మనం ఎంత శ్రమిస్తే దానికి తగ్గ ఫలితం ఉంటుందో లేదో అన్న అనుమానం.
మనిషి ఎప్పుడైతే వీటిని వీడి తను కోరుకున్న ఉన్నతి కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడో, తన కలను సాకారం చేసుకోవడానికి ఎంత కష్టమైన అయినా చిరునవ్వుతో శ్రమిస్తాడో అప్పుడే వారికి విజయం సొంతం అవుతుంది. అదృష్టం కలిసి వస్తే కాస్త ముందుగానే మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా నీ శ్రమనే నమ్ముకో. అదే నీకు ఆయుధం. అంతే కానీ ఊరికే ఏది వచ్చినా అది నీది కాదు గుర్తుంచుకో.