* మీ ఆలోచనలు సక్రమంగా ఉండేలా చూసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒకవేళ మీరు ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటే దిగులు మరింత పెరుగుతుంది.
* మీరు నివసించే ఇంటిని కూడా శుభ్రంగా, వస్తువులన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చిందరవందరగా ఉన్నట్లయితే మీ మనసు కూడా చిందరవందరగా తయారయ్యి, దిగులు మరింత పెరుగుతుంది.
* మీరు ఎటువంటి పనులు చేస్తే సంతోషంగా ఉండగలరో, ఆ పనులను రోజులో ఎక్కువ సేపు చేయడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు: కొంత మందికి పాటలు వినడమంటే మహా ఇష్టం, కొంత మందికి టీవీ చూడడం ఇష్టం. ఇలా మీకు ఏదిష్టమో మీరే సెలెక్ట్ చేసుకుని చేయండి. అందులోనే మీ ఆనందాన్ని వెతుక్కోండి.
* మీరు దేని గురించి అయినా ఎక్కువగా బాధపడుతుంటే, ఈ విషయాలన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో, ఆ విషయాలను పేపర్ పై చూడగానే అవి మీకు చిన్నవిగా అనిపిస్తాయి. తద్వారా వీటి గురించా నేను బాధపడుతోంది అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది.
* మీరు బాధపడుతున్న విషయం వలన మీకు ఏదైనా నష్టం కలిగితే ఏ విధంగా ఉంటుందో, అందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని గురించి ఊహించుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా మనము దిగులుగా ఉండడం వలన మనకు ఇంత నష్టం జరుగుతోంది కదా అని తెలిస్తే మీరు మళ్ళీ అన్హడంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఇలా లేనిపోని బాధలు వచ్చాయని దిగులు పడుతూ ఉండకుండా, దొరికిన ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా అనుభవించండి.