ఇది సాధించడానికి మన పాత్రే ప్రధానం. ముందుగా మనం ఎంచుకునే లక్ష్యం సరైనదై ఉండాలి. ఆ లక్ష్యం ఛేదించుటకు తగిన మార్గం ఏర్పాటు చేసుకోవాలి. మార్గ మధ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగి విజయాన్ని సొంతం చేసుకోవాలి. అది విద్య అయినా సరే వ్యాపారమైనా సరే చివరికి మీరు గెలిచే తీరాలి. అనుకున్నది సాధించ కుండా అస్సలు వెను తిరగరాదు. మీరు అందుకునే ఆ విజయమే మిమ్మల్ని ఈ సమాజం ముందు గొప్ప వారిగా నిలబెడుతుంది. అందరి తోనూ జేజేలు పలికిస్తుంది. ఎమీ సాధించని వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ సమాజం వైపు నుండి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని ఒక అధికారంలో నిలబడిన వ్యక్తి మాటలకు ఈ సమాజంలో దక్కే విలువే వేరు.
అందరూ వారి మాటలను గౌరవిస్తారు. అదే ఒక సాధారణ వ్యక్తి అత్యంత విలువైన సూత్రాలు చెప్పినా చెల్లని నోటులా అసలు పట్టించుకోరు. మన చుట్టూ ఉన్న సమాజంలో మనకంటూ ఒక స్థాయి ఉన్నప్పుడే అందరూ మన వెంట ఉంటారు. మనవాడని చెప్పుకుంటూ తిరుగుతారు. ఈ సమాజంలో జీవిస్తున్నందుకు మీకంటూ ఒక మార్క్ ఉండాలి. అది కేవలం మీరు ఒక స్థాయిలో ఉంటేనే వీలవుతుంది.