మనకు తెలిసి ఎంతోమంది రియల్ హీరోస్ వివిధ రంగాలలో దేశానికి సేవలు చేసి ఉన్నారు. కొన్ని కథలలో ఉండే హీరో పాత్రలు అయితే చాలా మందికి బాగా నచ్చుతాయి. వారిలాగానే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ కథలలో ఏదైనా సాధ్యమే నిజ జీవితంలో కూడా కొన్ని సాధ్యమే. కానీ మన తరపున సరైన ప్రయత్నం అనేది ఉండాలి. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో పరిస్థితులు ప్రతి ఒక్కరి మనసులను ఎంతగానో బాధిస్తున్నాయి. తాలిబన్లు వచ్చి అన్యాయంగా ఆఫ్గనిస్తాన్ ను ఆక్రమించుకోవడం కాదనలేని నేరం అని చెప్పాలి. ఈ పరిస్థితిని గురించి ఆలోచిస్తే మనకు గొప్ప కవి మరియు మేధావి అయిన రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన 'కాబూలీవాలా ' గుర్తు రాక మానదు. ఈ కథలో రహమూన్ అనే ఆఫ్ఘన్ పాత్ర అంటే చాలా మంది శ్రోతలకు ఇష్టం. ఈ కథ ఆ తర్వాత సినిమాగా కూడా తెరకెక్కి మంచి పేరు సంపాదించుకుంది.

ఆఫ్గనిస్తాన్ కు చెందిన ఒక కాబూలీవాలాగా పేరొందిన రహమూన్ ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ ప్రాంతానికి చెందిన వాడు. ఇతను ఆఫ్ఘానిస్తాన్ లో పండిన డ్రై ఫ్రూట్స్ ను కోల్ కతాకు తీసుకువచ్చి అమ్ముకుని వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యక్తి ఈ కథను చెప్పాడు. అక్కడే ఒక మధ్యతరగతికి వ్యక్తి కూతురు అయిన మినీ.. తన కంటే ఎంతో పెద్దవాడైన రహమూన్ తో స్నేహాన్ని పెంచుకుంటుంది. ఇతను చూడడానికి ఎంతో లూజుగా ఉండే దుస్తులు వేసుకుని, ఒక తలపాగ ధరించి, వెనుక ఒక సంచిని వేసుకుని ఉంటాడు. అయితే ఈ స్నేహం వలన రాహమూన్ చాలా మారిపోతాడు. ఇతను కూడా చిన్న పిల్లవాడిలాగా ఆమెతో కలిసి మెలసి ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇతను ఒక పెద్ద వాడయినప్పటికీ తన దగ్గరున్న ద్రాక్ష గింజలతో పిల్లల మనసును గెలుచుకోవడంలో విజయవంతం అయ్యాడు. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు.

ఈయన స్నేహం ఆ పాపను తల్లి లేని లోటు నుండి పూర్తిగా బయటపడేసింది. రాహమూన్ కోల్కతాకు వచ్చాడంటే ఇక ఆరోజు మినీ కి పండగలాగే ఉంటుంది. ఇద్దరూ కలిసి పర్వతాలు ఎక్కుతూ ఆడుకుంటారు. రాహమూన్ కూడా తన కూతురు నుండి విడిపోయి ఉంటాడు. అతనికి కూతురు ఎడబాటు వలన కలిగిన నొప్పికి ఒక మందులాగా మినీ స్నేహం పనిచేసింది. ఈ సినిమాలో రాహమూన్ గా బాలరాజ్ సాహ్ని నటించి మెప్పించారు. ఇందులో ఈయన నటన చూస్తే కంటి వెంట నీరు రావడం  ఆగదు. అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

యూట్యూబ్ లో ఈ సినిమా చూసిన ఒక ఆఫ్గనిస్తాన్ కు చెందిన ప్రేక్షకుడు... నేను పుట్టింది ఆఫ్గనిస్తాన్ లోనే, కానీ నా జీవితాన్ని అక్కడ గడపలేకవడం అన్ను ఎంతగానో బాధిస్తోందని చెప్పాడు.  అందుకే అంటారు పుట్టిన ఊరికి మించిన స్వర్గం లేదు అని, ఇందులో మినీ మరియు కాబూలీవాలా ల మధ్యన వచ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక తండ్రి కూతురు ప్రేమ ఎలా ఉంటుందో వీరిద్దరి మధ్యన అదే ఉంది. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఒక వ్యక్తిని హత్య చేసి రాహమూన్ జైలుకెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆ వయసులో మినీ పడిన వేదన మన మనసులో ఒక రోదనగా మిగిలిపోతుంది. అలా 10 సంవత్సరాలు  జైల్లో ఉండి...తీరా విడుదలయి మినీని చూడ్డానికి వస్త్తే... ఆ రోజు మినీకి పెళ్లి జరగబోతుండడం చూసే వారిని ఎంతగానో ఏడిపిస్తుంది. ఈ కథ ద్వారా తండిర్ కూతురు మధ్యన ప్రేమ... ఒక స్నేహం విలువ. అలాగే పుట్టిన మాతృభూమిని మరువొద్దు అనే విషయాలను చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ వాస్తవ పరిస్థితులను చూస్తే కన్నా దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నా ఎంతోమంది ఆఫ్ఘన్ లు కాబూలీవాలాలు రోధిస్తున్నారో తలుచుకుంటేనే గుండె బరువైపోతోంది. ఈ కథ ప్రతి ఒక్క ఆఫ్ఘన్ లకు అంకితం.


మరింత సమాచారం తెలుసుకోండి: