అమ్మలా గోరుముద్దలు తినిపించగలరు. ప్రేమానురాగాలతో  సప్తస్వరాలను ఆలపించ గలరు. నాయకురాలిగా దేశాన్ని పాలించగలరు. శీతల మనోవికాసంతో  ఆకలిని అర్థం చేసుకోగలరు. అంతరిక్ష అద్భుతాలను కూడా చెందించగలరు. గగనాన విమానాన్ని శాశించగలరు. ఝాన్సీ రాణిలా  కత్తి పట్టి చూపగలరు. రుద్రమదేవిల  యుద్ధాలను చేయగలరు.ఏ రంగం అయినా కానీ  రౌద్రంతో ముందుకు సాగాగలరు. బుల్లెట్లలా శత్రువు గుండెల్లో దూసుకుపోగలరు. అమ్మతనం నుంచి  గగనతలం వరకు  అన్ని విద్యలు వారి కిందనే అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో  అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు మహిళామణులు. మృదు స్వభావం మహిళామణులు అయిన యుద్ధ రంగంలోకి దిగితే మాత్రం  శత్రువుతో పోరాడే ప్రధాన భూమిక పోషించాలని రుజువు చేస్తున్న సైనిక అధికారులు మరొక మైలురాయిని దాటుకొని సగౌరవంగా వీరత్వాన్ని చాటుతున్నారు.

పురుషులతో సమానంగా తామేమీ తీసిపోమని పలు సందర్భాలలో రుజువు చేసిన మహిళామణులు  ప్రస్తుతం భారత సైన్యంలో  మరో అపూర్వ ఘట్టానికి ముందడుగు వేశారు. భారత సైన్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దేశానికి ఎన్నో సేవలు అందిస్తున్న ఐదుగురు మహిళా అధికారులకు  తొలిసారి  సైన్యంలో కర్నల్ హోదా లభించింది. దీన్ని రక్షణ రంగంలో  మహిళలకు అపూర్వ ఘట్టంగా చెప్పవచ్చు. ఇండియన్ సైన్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్సు కోడ్ విభాగాలకు   చెందినటువంటి ఐదుగురు అధికారులు  కర్నల్ హోదాను కల్పిస్తూ పదోన్నతిగా పొంది పర్మినెంట్ అర్హత సాధించడం హర్షణీయం.

తొలుత ఈ మహిళా సైనికాధికారులకు షార్ట్ సర్వీస్ కమిషన్ కు  మాత్రమే పరిమితం చేయబడి నటువంటి అడ్డుగోడల్ని దాటుకుంటూ, లింగ బేధాలను చెరిపేస్తూ ఈరోజు ఈ అద్భుత అవకాశాన్ని  సాధించడం  గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు సైన్యంలో  వైద్య మరియు విద్య  విభాగాలకే పరిమితమైన ఈ హోదా  నేడు ఇంజనీరింగ్ విభాగానికి కూడా  వర్తింపజేయడం  శుభ పరిణామంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే  ఆడపిల్లలు  ఎ ఎక్కడ కూడా తక్కువ కాదని , ఆడపిల్లలను తక్కువగా చూసేటువంటి కొంతమంది వ్యక్తులకు ఇది చెంపపెట్టు   అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: