బంధాలు బంధుత్వాలు అనేవి మనిషి యొక్క అస్తిత్వానికి మెరుగైన స్థితి గతులు. మన బాంధవ్యాలు మన ఆప్యాయతలు ఎనలేనివి. ప్రస్తుత జనరేషన్ లో అయితే వీటికి కాస్త విలువ తగ్గింది. కానీ ఒకప్పుడు చుట్టాలు లేకుండా కనీసం ఇంట్లో చిన్న పండగ కూడా జరుపుకునేవారు కాదు. అయితే మారుతున్న కాలంతో మన పద్దతులు మరియు అలవాట్లు మారాయి. పరుగులు తీస్తున్న కాలంతో పాటు జనాలు కూడా వారి వేగం పెంచక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకే సరిగా సమయం కేటాయించలేక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో బంధువులతో సమయం గడపడం అంటే ఇక అది గగనంగా మారింది. పెద్ద పెద్ద కార్యాలు, విశేషాలు అయితే తప్ప బంధువులు అంతా ఒకచోట చేరడం కష్టమైపోతోంది.

ఒకవేళ ఒకేచోట కలసినా ఎదో మొహమాటానికి పలకరించినట్లు మాట్లాడి తడి పొడి మాటలతో సర్దేస్తున్నారు. అందరూ ఇలానే ఉన్నారు అని అనలేము గానీ కొందరి వైఖరి మాత్రం ఇలానే ఉంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే మానవ సంభంధాలు పూర్తిగా కనుమరుగై పోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే మనిషిలో దయ, జాలి, కరుణ వంటి లక్షణాలు లేదా గుణాలు కనుమరుగై పోయి మనిషి పూర్తిగా స్వార్దపరుడిగాను, క్రూరంగాను మారిపోయే అవకాశం ఉంది. అందుకే కనీసం మన తరువాతి తరాల వారైనా మళ్ళీ మునుపటి రోజుల్లో లాగా తమ తమ వాళ్ళతో నిస్వార్థంగా కలసి కట్టుగా బ్రతికగలిగితే మళ్ళీ మానవ సంబంధాలు కొత్త చిగురులు తొడుగుతాయి.

బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏమిటి అంటే...వినేది సగం , అర్దం చేసుకునేది పావు, ఆలోచించడం సున్నా...రియాక్షన్ మాత్రం 100 కి 200%.. కాబట్టి ఎప్పటికైనా మనిషికి మనిషే సాయం. ఆ ఆస్తులు అంతస్తులు సిరిసంపదలు మన సుఖ సంతోషాలను తెచ్చివ్వలేవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: