మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాల్లో ఉపాధి కూడా ఒకటి. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసిస్తుంది. కొందరు తాము తమ జీవితం ఎలా ఉండాలి, ఏ లక్ష్యాన్ని ఎంచుకోవాలి, ఎలా ఈ సమాజంలో బ్రతకాలి అన్న విషయం పట్ల ఓ క్లారిటీ తో ఉంటారు. కొందరు తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి అన్న అంశాల గురించి ఒక నిర్ణయానికి వచ్చేసి అందుకు అనుగుణంగా ప్రణాళికను రెడీ చేసుకుంటారు. మరి కొందరు మాత్రం ఎటువంటి లక్ష్యం, గమ్యం లేకుండానే జీవితం చూపించిన దారిలో ముందుకు వెళుతుంటారు. ఫలానా చదువు చదవాలి, ఫలానా ఉద్యోగం చేయాలి, ఇలానే బ్రతకాలి అన్న ఆలోచనలను అస్సలు దరికి చేరనివ్వరు.

ఎప్పటికప్పుడు ఎలా తోస్తే అలా వెళ్లిపోతుంటారు. అయితే ఇక్కడ ఈ రెండు విషయాలలో ఏది పూర్తిగా కరెక్ట్ అని కానీ తప్పు అని కానీ చెప్పలేము. ఎందుకంటే జీవితం అనే ప్రయాణంలో ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరగాలంటే ఖచ్చితంగా కుదరని పనే అవుతుంది. అలాగని ఎటువంటి ఆలోచన, లక్ష్యం, ఒక చిన్నపాటి ప్రణాళిక లేకుండా గాలి ఎటు వేస్తే అటు పొదాములే అనుకున్నా పొరపాటే. ప్రతి ఒక్క మనిషికి తను ఎలా బ్రతకాలి, తన జీవితం ఎలా ఉండాలి అన్న ఒక చిన్న ఆలోచన వస్తే తను ఎలాంటి ఉపాధిని ఎంచుకోవాలి అన్న ఆలోచన కూడా వస్తుంది. అందులోనుండే మీ లక్ష్యం ఏమిటన్న నిర్ణయం తీసుకోవాలన్న ఆసక్తి మొదలవుతుంది.

అందరూ తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ఒకటి రెండు ప్రయత్నాల్లోనే చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చేమో కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఒకవేళ పలు మార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు అంటే మీ ప్రయత్నంలోని లోపాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. నెమ్మదిగా వాటిని మార్చుకుంటూ మీ లక్ష్యాన్ని ఛేదించడానికి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. అంతే కానీ ఏ లక్ష్యం లేని జీవితాలు ఎందుకు పనికి రావు. అలాంటివాళ్ళు భూమికే భారం.

మరింత సమాచారం తెలుసుకోండి: