ఇంకొందరు ఏదేమైనా అనుకున్నది సాధించే వరకు ఆగేదే లేదంటూ అన్నిటినీ ఓర్పుగా ఎదుర్కుంటూ సంతోషంగా ముందుకు సాగి విజయ శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ మీరు ఎలా ఉండాలన్నది ఏ గమ్యానికి చేరుకోవాలన్నది రెండూ మీ చేతిలోనే ఉంటాయి. ఎవరి వల్లనో మీరు ఓడిపోవడం లేదా గెలవడం లేదు. మీ వల్లనే మీ నిర్ణయం మూలంగానే గెలుపోటములు నిర్ణయించబడతాయి. ఆలోచించి అడుగులు వేయండి పరిష్కారం లేని సమస్య, దూరం తరగని తీరం ఉండవు..పోరాడితే గెలుపు.
నీకు నీవే ప్రశ్న
నీకు నీవే సమాధానం
నీకు నీవే దైర్యం, స్ఫూర్తి
నీకు నీవే బాధ, సంతోషం
నిర్ణయం మీదే గెలుపోటముల ఎంపిక కూడా నీదే.
మరి నీ పయనం ఏమిటన్నది నీవే నిర్ణయించాలి. కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. అడుగు పడందే పయనం మొదలు కాదు...ప్రణాళికతో కదులు అనుకున్నది అందుకో అన్నారు ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులు చెప్పిన అమూల్యమైన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పరుగులు తీయి. విజయం అంటే ఎక్కడో లేదు.. నీలోనే ఉంటుంది కానీ, అది తెలుసుకునే లోపు నీ జీవితం ముగిసిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకో. ఈ క్షణం నుండి నీ జీవితంలో గడిపే ప్రతి క్షణం నీ గెలుపు కోసమే కావాలి.