విజయానికి ఆత్మ విశ్వాసం అనేది ఎంత ముఖ్యమైనదో అదే విధంగా ఆత్మ విశ్వాసానికి సాధన అంత అవసరం. మన ప్రయత్నం ఒక సాదనే...ప్రతి ఓటమి నుండి నేర్చుకోవాల్సింది. అలాగే మన ప్రయత్నంలో మార్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. ఓటమిని గుణపాఠంగా అనుకుని మరింత గట్టి ప్రయత్నం చేస్తే విజయం తప్పక అందుతుంది.
కష్టంతో పాటు ఓపిక కూడా ఉంటే ఎదో ఒకరోజు విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. విజయాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా, శ్రద్ధగా ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు.
కాబట్టి మీరు విజయం కోసం చేసే ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ అనుకున్నహ్ది సాధించడం వీలు కాదు. దాని కోసం గట్టి ప్లానింగ్ మరియు సమర్ధత అవసరం. నిన్ను నువ్వు నమ్మినప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. అలా కాకుండా కొందరు విజయం మాట దేవుడు ఎరుగు, అస్సలు ప్రయత్నమే చేయరు. అలాంటి వారు విజయం పొందడానికి ఏ మాత్రం అర్హులు కారు.