మంచి నడవడిక, ఉన్నతమైన విద్య, జీవన విధానం పట్ల స్పృహ ఇవే పిల్లలని రేపటి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ముందుగా పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంచి అలవాట్లను, సత్ప్రవర్తనను అలవాటు చేయాలి. విద్య పై వారికి ఆసక్తి పెరిగేలా చూసుకోవాలి. వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన పనికి ప్రణాళిక అనేది అవసరమన్న విషయాన్ని చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. ముఖ్యంగా సమయానికి విలువ ఇచ్చి అందుకు అనుగుణంగా నడుచుకునే ప్లానింగ్ ఉండాలని తెలియచేయాలి. తమకంటూ ఒక లక్ష్యం ఉండేలా ప్రేరేపించాలి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని కష్టపెట్టే నేర్పించడం కన్నా వారు ఇష్టపడే లా చేసి నేర్పిస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలి. ఇలా చేయడం వలన మీ పిల్లలు ఒక మంచి జీవన విధానానికి అలవాటు పడతారు, విద్యలో ముందుంటారు. విద్య వారికి మంచి ఉన్నత ఉద్యోగాలు అందేలా చేస్తే వారి సత్ప్రవర్తన సమాజంలో గౌరవింపబడేలా చేస్తుంది.