ఈ విషయాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ సలహాలు పాటించడం వలన ఖచ్చితంగా విజయం మీ సొంతం అని చెప్పలేము. కానీ విజయానికి ఒక ముఖ్యమైన సోపానం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతకీ ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు అన్న విషయాన్ని ఇపుడు తెలుసుకుందాం.
చాలా మంది ఒక మాటపై నిలబడి ఉండలేరు. కాసేపు ఇది కాసేపు అది, ఇంకాసేపు మరొకటి ఇలా వారి అభిరుచులను మార్చుకుంటూ పోతారు. ఇలాంటి వారు తమ లక్ష్యాలను కూడా తరచూ మార్చుకుంటూ ఉంటారు. కాస్త కష్టం అనిపించినా, ఇతరులు కాస్త మోటివేట్ చేసినా వారు చేస్తున్న పనిని వదిలి, వారి లక్ష్యాన్ని మధ్యలోనే గాలికి విడిచి వెంటనే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి వైఖరి, అలవాటు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు, ఏ పనిని పూర్తి చేయలేరు. ఇతరుల సలహా తీసుకోవాలి. కానీ అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందా అన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. అదే విధంగా సోమరితనం, నిజాయతీ లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం వంటి అలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. అపుడే మీ విజయానికి మీరు చేరువ కాగలరు.