
ఒక మహిళ మాటోరి అనే గ్రామంలో నివసిస్తూ ఉంది. ఈమె పేరు సంగీత పింగ్లే. రోడ్ ప్రమాదంలో భర్తను కోల్పోయింది. ఇక భారమంతా తనపైనే పడింది. తమ మామగారికి ఉన్న 13 ఎకరాల ఆపొలంలో వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకుంది. అయితే మొదట్లో ఈమెను అందరూ ఎగతాళి చేసినవారే, మహిళ వ్యవసాయం చేయడం ఏమిటి? నీవల్ల కాదు అంటూ సూటి పోటీ మాటలతో నిందించినవారే. అయితే వీటన్నింటినీ సంగీత సవాలుగా తీసుకుంది. ఎలాగైనా వీరి మాటలకు ఒక అర్ధం చెప్పాలని, వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. ఈమె తనకు ఉన్న పొలంలో ద్రాక్ష మరియు టమాటో పంటలను వేసి సాగుచేసింది.
రెండు పంటలు అద్భుతంగా చేతికి వచ్చాయి. ఒక్క ద్రాక్ష పళ్ళ నుండి సంగీత 20 నుండి 30 లక్షల వరకు సంపాదిస్తోంది. ఈ ఆదాయంతో తన పిల్లలను మంచి స్కూల్ లో చదివిస్తూ సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈమెను నిందించారో వారందరికీ చెంప పెట్టులాగా తన అభివృద్ధి తోడ్పడింది. మహిళ వ్యవసాయం కూడా చేయగలనని నిరూపించింది. ఇకనైనా మహిళల గురించి ఇలాంటి సూటి పోటీ మాటలు అనడం తగ్గించండి.