ఈ సమయంలో మనము మనకు దగ్గరైన వారి నుండి సహాయాన్ని పొందాలి. అంటే అన్నీ సమస్యలు మనమే పరిష్కరించుకోవడం కుదరదు. కొన్ని సమయాల్లో ఇతరుల సహాయం ఖచ్చితంగా అవసరం. అయితే సహాయం మనం కోరే ముందు...ఒక్క విషయం మనకు మనము ప్రశ్నించుకోవాలి. మనము ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నామా? అంటే పెద్ద వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సహాయానికి సహాయం చెయ్యాలి అని, కాబట్టి మీలో ఆ లక్షణం ఉందా అనేది బాగా ఆలోచించండి. మీకు ఈ సమయంలో సహాయం చేసిన వారు ఏదో ఒక సమయంలో కష్టాల్లో ఉండవచ్చు. అలాంటప్పుడు వారు అడిగినా అడగకపోయినా వారి గురించి మీకు తెలియగానే సహాయం చేయడానికి సిద్దంగా ఉండాలి.
అప్పుడే మీరు పరిపూర్ణమైన మనిషి అనిపించుకుంటారు. అలా కాకుండా కొందరు స్వార్థ పరులు ఉంటారు, ఇతరులను తమ అవసరం కోసం వాడుకుని... వారికి సమస్య వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. ఇది మానవత్వం అనిపించుకోదు. ఇలాంటి వారు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. ఒకవేళ సక్సెస్ అయినా అది కేవలం తాత్కాలికం మాత్రమే. కాబట్టి గుర్తు పెట్టుకోండి సహాయం చేసే గుణం ఉంటేనే ఇతరుల సహాయం పొందండి.