జీవితంలో అందరికీ అన్నీ దొరకవు అన్న విషయం తెలిసిందే. కొందరు మాత్రం దొరికిన వాటితో సంతృప్తి పడుతూవుంటారు. మరి కొందరు సత్యాన్ని గ్రహించలేక మనకు దక్కని వాటి కోసం జీవితాంతం పోరాడుతూ ఉంటారు. అయితే మనము ఎన్ని సాధించినా పోగొట్టుకున్నా ఎప్పటికీ కొన్ని కీలక విషయాలను మాత్రం మరిచిపోకూడదు. ఇవి మీరు ఎప్పటికీ గుర్తుంచుకుని ఆచరణలో పెట్టినట్లయితే మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రశాంతంగా ఉండగలం. ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మీకు ఎంత లాభం అంది అనుభవించక మీరే చెబుతారు. మరి ఆ మూడు విషయాలు ఏమిటో ఒకసారి చూద్దామా.

1 . మీ వయసు: ఈ పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలంటే నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. ఒక స్థాయికి వచ్చాక ఇక చాలులే అని తృప్తి పడితే, నీకు మించి అలాంటి వారు చాలా మంది తయారవుతారు. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా జీవీతిహమనే పోరాటంలో నిరంతరం ఒక శ్రామికుడిలా పనిచేస్తూనే ఉండాలి. ఇలా జరగాలంటే ముందు మీరు మీ వయసును మరిచిపోవాలి. వయసు గుర్తు వచ్చిందా సోమరితనం వచ్చేస్తుంది. ఇక అది మొదలు మన జీవితం విశ్రాంతికి పరిమితం అయిపోతుంది.

2. గడిచిపోయిన రోజులు : మనిషి అన్నాక మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. అయితే గతంలో జరిగి పోయిన చెడు క్షణాలను గుర్తుకు తెచ్చుకోవద్దు. ఇవి మీకు ఏమాత్రం మంచి చేయకపోగా, మీ ఎదుగుదలను ఆపివేస్తాయి. కాబట్టి గడిచిన రోజులు మనవి కావు అని వదిలేయడం ఉత్తమం.

3 . కోపతాపాలు: మనము సమాజములో బ్రతుకుతున్నాము. మన తోటి వారితో ఏదో ఒకవిధమైన సంబంధాన్ని కలిగి ఉంటాము. అయితే ఈ సందర్భంలో కోపతాపాలు రావడం సహజమే. వీటిని మనసులో పెట్టుకుని వారిపైన పగ సాధించడం లేదా మాట్లాడకుండా ఉండడం చేయడం చాలా పొరపాటు. వీటిని సర్దుకుని మళ్ళీ వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: