ఇప్పుడు మనం కోరుకున్న ఉన్నత స్థాయిలో నిలబడి ఉన్నాం ఇక దిగులెందుకు, అలాగే అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఏముంది..?? అంటూ చాలా నిర్లక్ష్యం చూపుతారు. కానీ ఆ నిర్లక్ష్యమే సమయం కలసి రాకపోతే మిమ్మల్ని మళ్ళీ అట్టడుగు స్థాయికి దిగేలా చేస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నది సాధించడం కాదు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కూడా తెలిసుండాలి అన్నారు పెద్దలు. అది అక్షరాల నిజం. కానీ మన నిర్లక్ష్యం పలు సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. అందువలన విజయం అందుకున్నాక ఆ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. కానీ ఆ ఆనందంతో పూర్తిగా రిలాక్స్ అయి పోకూడదు.
అదే మన పతనానికి నాంది పలుకుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. అపుడే మన గౌరవం మనకి దక్కుతుంది. విజయం సొంతమైన ఆనందంలో అన్నిటినీ పక్కన పెట్టి విజయ గర్వంతో విర్రవీగితే ఆ విజయానికి విలువ లేకుండా పోతుంది. అంటే ఈ విధంగా అందరూ చేస్తారు అని కాదు. ఎక్కువ మంది ఇదే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మీ జీవితానికి మంచిది. నష్టం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ముందే మేల్కొనడం వలన అంతా సంతోషంగా ఉంటుంది.