నమ్మకానికి మన కృషి మరియు దృఢ సంకల్పం కూడా తోడైతే విజయాన్ని సాధించడం అంత కష్టమేమీ కాదు.
చాలా మంది చేస్తామో? చేయలేమో? ఇది వర్కౌట్ అవుతుందో లేదో అంటూ పలు రకాల సందేహాలతో సంకోచిస్తూ ఉంటారు. ఆ అనుమానాలతో అటు ముందుకు నడవలేక వెనక్కి అడుగు వేయడానికి మనసు అంగీకరించక సతమతమౌతూ ఉంటారు, అటువంటి వారు ముందుగా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. పుట్టిన వెంటనే ఎవరు కూడా అన్ని విద్యలలోనూ నిపుణులు కాలేరు. అభ్యాసం మనకి ఒక్కొక్కటీ నేర్పుతూ పోతుంది.
అదే విధంగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం మనకు అంత సులువు కాకపోవచ్చు , కానీ నమ్మి సాగితే అన్ని అవే వంటబడుతాయి. మనకు కాలమే అన్నిటినీ నేర్పుతుంది సంకల్ప బలంతో సాధించ లేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు అడుగు వేయండి అన్నివిజయాలే దక్కుతాయి. మీరు బలంగా నమ్మి ఎడారిలో అడుగేసినా మీదే విజయం అవుతుంది. అంతటి బలం నమ్మకములో ఉంటుంది. ఇది తెలియక ఎందరో అవతలి వారిపై ఆధారపడి పనులు చేస్తూ ఉంటారు.