కొన్ని సార్లు మనం అనుకున్న బంధాలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. తన కోపమే తన శత్రువు...తన శాంతమే తనకు రక్ష అని అంతా అంటుంటారు. అందుకే మనకు ఆగ్రహం వస్తున్నప్పటికీ చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నించాలి. కానీ...ఆ కోపానికి యాక్షన్ కూడా జత చేసి బరస్ట్ అయితే నష్టమే జరుగుతుంది. అదే కోపం కొన్ని సార్లు మనం కోరుకున్న విజయాన్ని సైతం దూరం చేస్తుంది. కొన్నిసార్లు మీరు చూపించే అతి ప్రేమ కూడా ఇతరులకు కష్టం కలిగించవచ్చు. ఏ ఎమోషన్ అయినా సరే హద్దులు దాటితే అర్దం ఉండదు.
అలాగని ఎమోషన్ కి కొలమానం ఉండాలి అని చెప్పలేము. కానీ పరిమితికి మించితే అది అమృతమైనా ప్రమాదమే అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. నీకు కోపం వచ్చినా ఆ ఒక్క క్షణాన్ని జయించగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మీకు కోపం వస్తుంది అనిపిస్తే దానిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంతా శుభమే జరుగుతుంది. అంతే కానీ అర్ధం లేని కోపంతో జీవితంలో మరిన్ని కష్టాలు తెచ్చుకోవద్దు.